Wipro Ends Work From Home: వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే, ఉద్యోగులకు షాకిచ్చిన విప్రో, రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించిన టెక్ దిగ్గజం
ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టాప్ సంస్థలు ఉద్యోగుల్ని ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించాయి.
దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో (Wipro) వర్క్‌ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించింది.ఇక మీదట ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టాప్ సంస్థలు ఉద్యోగుల్ని ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించాయి. ఇప్పుడు విప్రో కూడా తమ ఉద్యోగులకు ఇలాంటి సూచనే చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందే, వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక ప్రకటన
ఈ మేరకు నవంబర్ 6వ తేదీన ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. ఈ ఆదేశాలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే 55 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడుసార్లు ఆఫీసులకు వస్తున్నారు. అయితే మిగతా ఉద్యోగులు కూడా వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను ముగించి హైబ్రిడ్ తరహలో ఆఫీసుల నుంచి పనిచేయాలని, దీని వల్ల వృత్తిపరమైన అభివృద్ధి ఉండటంతో పాటు సహోద్యోగులు, క్లయింట్లతో నేరుగా సంభాషిస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని ఐటీ సంస్థ పేర్కొంది.
ఇక టీసీఎస్ (TCS) ఇప్పటికే వారానికి ఐదు రోజులు ఉద్యోగులు తప్పని సరిగా ఆఫీసుకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్ (Infosys) కూడా నెలకు 10 రోజులు కార్యాలయాలకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ మేరకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది.