PSL -9: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు ఫుడ్ పాయిజ‌న్, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం, ఆహారం తిని 13 మంది ప్లేయ‌ర్ల‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

కరాచీ కింగ్స్‌కు (Karachi Kings) చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సుమారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది

Pakistan National Flag (Image used for representational purpose only) (Photo Credits: Pixabay)

Karachi, FEB 29: పాకిస్తాన్‌ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) 09వ సీజన్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు (Karachi Kings) చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సుమారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. సఫారీ స్పిన్నర్‌ తబ్రేజ్‌ షంసీ, ఆసీస్‌ పేసర్‌ డేనియల్‌ సామ్స్‌లు పలు మ్యాచ్‌లకు దూరమైనట్టు సమాచారం. పీఎస్‌ఎల్‌-9లో భాగంగా గురువారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో కరాచీ కింగ్స్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా ఈ మ్యాచ్‌కు ముందు బుధవారం వాళ్లు తిన్న ఫుడ్‌ పాయిజన్‌ అయింది. సుమారు 13 మంది ప్లేయర్లు ఫుడ్‌ పాయిజన్‌ బారిన పడ్డారు. జట్టులోని ఫారెన్‌ ప్లేయర్లు అయిన లియూస్‌ డు ప్లూయ్‌ కడుపులో తీవ్రమైన మంట, నొప్పితో ఆస్పత్రి పాలుకాగా షంసీ, సామ్స్‌లు క్వెట్టాతో మ్యాచ్‌కు దూరమైనట్టు డాన్‌ పత్రిక విలేకరి ఇమ్రాన్‌ సిద్ధిఖీ ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా తెలిపాడు.

Pakistan: పాకిస్తాన్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్‌ సరికొత్త రికార్డు, పంజాబ్‌ ప్రావిన్స్‌కు తొలి మహిళా సీఎంగా ఎన్నికైన మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు 

ఆటగాళ్లతో పాటు హెడ్‌కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. అయితే ఫుడ్‌ పాయిజనింగ్‌ అయినవారిలో నలుగురు మినహా మిగిలినవారంతా క్వెట్టాతో మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నట్టు కరాచీ కింగ్స్‌ తెలిపింది. క్వెట్టాతో కొద్దిసేపటిక్రితమే మొదలైన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్‌.. ముగ్గురు ఫారెన్‌ ప్లేయర్లతోనే బరిలోకి దిగింది. పీఎస్‌ఎల్‌ -2024 పాయింట్ల పట్టికలో కరాచీ కింగ్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి రెండు ఓడి ఐదో స్థానంలో ఉంది.