308 Indian Prisoners in Pakistani Jails: పాకిస్థాన్ జైలులో 308 మంది భారతీయులు, ఇండియా జైలులో 417 మంది పాకిస్తానీయులు, వివరాలను పంచుకున్న ఇరుదేశాలు
జైళ్లలో ఉన్నవారిలో 266 మంది మత్స్యకారులు కాగా, 42 మంది పౌరులు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ వివరాలను భారత్‌తో పంచుకున్నట్టు పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.
New Delhi, July 3: పాకిస్థాన్ దేశంలోని జైళ్లలో 308 మంది భారతీయులు మగ్గిపోతున్నారంటూ పాకిస్థాన్ ప్రభుత్వం భారత హైకమిషన్‌కు నివేదించింది. జైళ్లలో ఉన్నవారిలో 266 మంది మత్స్యకారులు కాగా, 42 మంది పౌరులు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ వివరాలను భారత్‌తో పంచుకున్నట్టు పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.
ప్రధాని మోదీ నివాసం మీదుగా డ్రోన్.. దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు
శిక్ష పూర్తి చేసిన 254 మంది మత్స్యకారులతో పాటు, నలుగురు పౌరులను వెంటనే విడుదల చేయాలని భారత్ పాకిస్థాన్‌ను కోరింది. కాగా పాక్‌లో ఉన్నట్టే భారత్‌లో కూడా 417 మంది పాకిస్థానీలు వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. భారత్‌లో శిక్షా కాలం పూర్తి చేసుకున్న తమ దేశస్థులను విడుదల చేయాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది. కాగా, గతంలో చేసుకున్న ఒప్పం దం ప్రకారం ఇరు దేశాలు ఖైదీల వివరాల జాబితాను పంచుకుంటున్నాయి.