Newdelhi, July 3: ఢిల్లీలోని (Delhi) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నివాసంపై డ్రోన్ (Drone) ఎగరడం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో ప్రధాని నివాసంపై డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు.ఈ విషయంపై ఎస్పీజీ (SPG) ఢిల్లీ పోలీసులకు (Delhi Police) సమాచారం అందించడంతో పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటీన ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు, భద్రతా సిబ్బంది డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు వెళ్లింది అనే విషయాలపై వెతుకులాట ప్రారంభించారు. అయితే, పోలీసులకు డ్రోన్ గురించి ఎలాంటి సమాచారం లభించలేదు.
PM Modi's residence comes under the red no-fly zone or no drone zone | @arvindojha https://t.co/lr5Obn8OvI
— IndiaToday (@IndiaToday) July 3, 2023
నో ఫ్లయింగ్ జోన్
ప్రధాని మోదీ నివాసం, పరిసర ప్రాంతాల్లో నో ఫ్లయింగ్ జోన్ అమల్లో ఉంది. అయినా, మోదీ నివాసంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపుతోంది. ప్రధాని అధికారిక నివాస భవనం దేశ రాజధాని ఢిల్లీలోని లుటియన్స్ జోన్‌లోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉంది. 2014 నుంచి ప్రధాని మోదీ అక్కడే నివాసం ఉంటున్నారు. పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రధాని నివాసం ఉంటుంది.