Accident in Pakistan: ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి బోల్తాపడిన బస్సు, 22 మంది మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు, పాకిస్తాన్‌లో విషాద ఘటన

ప్యాసింజర్‌ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు సహయంతో సహయక చర్యలు ప్రారంభించారు.

Road accident (image use for representational)

Islamabad, November 3: దాయాది దేశం పాకిస్తాన్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్‌ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు సహయంతో సహయక చర్యలు ప్రారంభించారు. బస్సు బలోచ్‌ ప్రాంతం నుంచి రావల్పిండి వెళ్తుండగా సుద్నోతి జిల్లాలో ప్రమాదం సంభవించింది.

ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సు.. బ్రేకులు సరిగా పడకపోవడం వలన అదుపుతప్పి 500 మీటర్ల పాటు.. రోడ్డుకిందకు వచ్చి పడింది. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

చైనాలో ఆకలికేకలు, ముందస్తుగా ఆహారం నిల్వ చేసుకోవాలని చైనా సర్కారు ఆదేశం, మరో సంక్షోభానికి దారి తీస్తుందని ప్రపంచదేశాల ఆందోళన

గత నెలలో విద్యార్థులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురయిన విషయం విదితమే. అలాగే మరో ప్రమాదకర ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదాలు పూంచ్, నీలుం జిల్లాల్లో జరిగాయి. ఈ రెండు విషాద ఘటనల్లో నలుగురు విద్యార్థులతో పాటు చాలామంది ప్రయాణికులు మరణించారు. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి.