IPL Auction 2025 Live

Al-Qadir Trust Corruption Case: ఇమ్రాన్ ఖాన్ మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం, ఆయనకు వ్యతిరేకంగా మొత్తం 121 కేసులు, రెండు వారాల బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

ఇదే కేసులో పారామిలిటరీ బలగాలు ఆయన్ని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Imran Khan (Photo Credit- Facebook)

Lahore, May 12: అల్‌ఖాదీర్‌ ట్రస్ట్‌ కేసులో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇస్లామాబాద్‌ హైకోర్టు (Islamabad High Court ) రెండు వారాల బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో పారామిలిటరీ బలగాలు ఆయన్ని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అల్‌ఖాదీర్‌ ట్రస్ట్‌ భూకబ్జా కేసులో విచారణకు ఇమ్రాన్‌ ఖాన్‌ హాజరవుతూ వస్తుండగా, పారామిలిటరీ రేంజర్ల సాయంతో దర్యాప్తు సంస్థ ఎన్‌ఏబీ ఆయన్ని అరెస్ట్‌ చేసింది.

ఆపై కోర్టు ఆదేశాలతో విచారణ కోసం కస్టడీలోకి కూడా తీసుకుంది. ఈ తరుణంలో గురువారం సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. ఇమ్రాన్‌ఖాన్‌ను గంటలోగా తమ ఎదుట హాజరు పర్చాలని ఆదేశించడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు.

ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయండి, ఆయనను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్‌ చేశారని మండిపడిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు

ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌ సమయంలో ఎన్‌ఏబీ( నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో) వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. ఆయన అరెస్ట్‌ చట్టవిరుద్ధంగా ఉందని, చెల్లుబాటు కాదని పేర్కొంది. తక్షణమే విడుదల చేయాలని ఆదేశించడంతో పాటు ఇవాళ(శుక్రవారం) ఇస్లామాబాద్‌ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

దీంతో నేడు ఆయన కోర్టుకు హాజరుకాగా.. అల్‌ఖదీర్‌ ట్రస్ట్‌ భూకబ్జా కేసులో రెండు వారాలపాటు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టు ఊరట ఇచ్చింది. అంతేకాదు.. మే 9వ తేదీ తర్వాత ఖాన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఏ కేసుల్లో ఆయన్ని అరెస్ట్‌ చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన ఎన్‌ఏబీ కస్టడీ నుంచి రిలీజ్‌ అయ్యారు.

పాక్ ప్రధాని ఇంటిపై పెట్రోల్‌ బాంబులు దాడి, ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో రణరంగంగా మారిన దాయాది దేశం, ఎనిమిది మంది మృతి, 290 మందికి గాయాలు

ఇదిలా ఉంటే లాహోర్‌ పోలీసుల బృందం ఒకటి ఇస్లామాబాద్‌కు బయల్దేరడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి అరెస్ట్‌ అవుతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఆయనపై దాఖలైన కేసులకు గానూ ఇవాళ(శుక్రవారం) మరోసారి ఖాన్‌ను అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానిక డాన్‌ కథనం ప్రచురించింది. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా మొత్తం 121 కేసులు నమోదు అయ్యాయి. అవినీతితో పాటు ఉగ్రవాదం, హింసను ప్రేరేపించడం, మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం లాంటి తీవ్ర నేరాలు సైతం ఉన్నాయి.



సంబంధిత వార్తలు