Pakistan PM Imran Khan

Lahore, May 11: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు పాకిస్తాన్‌ సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయన అరెస్ట్‌ను చట్టవిరుద్ధమైందిగా తేల్చిన సుప్రీం కోర్టు.. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని గురువారం సాయంత్రం ఆదేశించింది. ఆయన అరెస్ట్‌లో నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో వ్యవహరించిన తీరును ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. విచారణకు హాజరైన ఇమ్రాన్‌ ఖాన్‌ను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్‌ చేశారని మండిపడింది.

పాక్ ప్రధాని ఇంటిపై పెట్రోల్‌ బాంబులు దాడి, ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో రణరంగంగా మారిన దాయాది దేశం, ఎనిమిది మంది మృతి, 290 మందికి గాయాలు

అల్‌ ఖాదీర్‌ ట్రస్ట్ ల్యాండ్‌కు సంబంధించిన కేసులో ఇస్లామాబాద్‌ హైకోర్టు విచారణకు హాజరైన ఇమ్రాన్‌ ఖాన్‌ను.. అటు నుంచి అటే అరెస్ట్‌ చేసింది. ఈ క్రమంలో నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో ఎనిమిది రోజుల విచారణకు ఇమ్రాన్‌ ఖాన్‌కు కస్టడీకి తీసుకుంది కూడా. మరోవైపు ఖాన్‌ అరెస్టును ఖండిస్తూ.. పాక్‌లో అల్లర్లు హింసకు పాల్పడ్డారు పీటీఐ కార్యకర్తలు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు జోక్యం ద్వారా పరిస్థితి కాస్త చల్లబడినట్లయ్యింది.