Australia Floods: మెరుపు వరదలు..భయం గుప్పిట్లో వేలాదిమంది ప్రజలు, 1960 తర్వాత ఆ స్థాయి వరదలతో విలవిలలాడుతున్న ఆస్ట్రేలియా, జలమయమైన సిడ్నీ,న్యూసౌత్ వేల్స్
అక్కడి జనాలు అర్ధరాత్రిళ్లు ఇళ్లొదిలి.. ప్రాణాలు అరచేత పట్టుకుని.. బిక్కు బిక్కుమంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సిడ్ని నగరాన్ని, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రాన్ని వానలు (Australia floods) ముంచెత్తాయయి. నదులు పొంగి ఇళ్ళలోకి రావడంతో అక్కడి వాసులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోడ్ల మీదకు పరుగులు తీస్తున్నారు.
Sydney, Mar 21: అనుకోని వర్షాలతో ఆస్ట్రేలియా అతలాకుతలం అవుతోంది. అక్కడి జనాలు అర్ధరాత్రిళ్లు ఇళ్లొదిలి.. ప్రాణాలు అరచేత పట్టుకుని.. బిక్కు బిక్కుమంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సిడ్ని నగరాన్ని, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రాన్ని వానలు (Australia floods) ముంచెత్తాయయి. నదులు పొంగి ఇళ్ళలోకి రావడంతో అక్కడి వాసులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోడ్ల మీదకు పరుగులు తీస్తున్నారు.
న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో (New South Wales) నాలుగు రోజులుగా కుంభ వృష్టి ధాటికి జనం అర్ధరాత్రిళ్లు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సిడ్నీ సిటీ (Sydney Floods) మొత్తం జలమయమైపోయింది. అనేక లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీతూర్పు తీరంలో రికార్డు స్థాయి వర్షపాతంతో వరదలు ముంచెత్తాయి. దీంతో సిడ్నీ పరిసర ప్రాంతాల్లో వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు రానున్నట్లు ఒక రోజు ముందుగానే అధికారులు హెచ్చరించారు. కాగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునుగుతున్నాయి. ఈ వరదలు ఓ విపత్తు అని స్థానిక క్లబ్ టారీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ అలెన్ అన్నారు. స్థానికంగా కొందరు ఈ వరదల్లో తమ సర్వస్వాన్నీ కోల్పోయారని ఆయన చెప్పారు.
Here's Updates
వచ్చే గురువారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సిడ్నీ ప్రజలకు ప్రధాన తాగునీటి వనరు అయిన వారగంబా డ్యామ్ (Warragamba Dam) 30 ఏళ్ల తర్వాత పూర్తిగా నిండి ఓవర్‌ఫ్లో అవుతోంది. ఇప్పటికే ఎమర్జెన్సీ సర్వీసులకు సాయం కావలంటూ వెయ్యికి పైగా కాల్స్ వచ్చాయి. వర్షాలు, వరదల కారణంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభాన్ని మరింత ఆలస్యం చేస్తోంది.
న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో "భారీ" ఫ్లాష్ వరదలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఎమర్జెన్సీకి ఫోన్లు చేసి కాపాడండంటూ జనం మొర పెట్టుకుంటున్నారు. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరళి వెళుతున్నారు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం లేకపోయినా.. వరదలు మరింత పెరిగితే ప్రాణ నష్టమూ జరిగే ముప్పు ఉందని సిడ్నీ అధికారులు చెబుతున్నారు. 1960 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ ఇంతటి వర్షాలు పడలేదని అధికారులు, ప్రజలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించింది.
Here's Floods Videos
ఇటు న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం కూడా 16 ప్రకృతి విపత్తుల డిక్లరేషన్లపై సంతకాలు చేసింది. గురువారం చినుకు చినుకుగా మొదలైన వాన.. శనివారం నాటికి ఉగ్రరూపం దాల్చిందని, వరదలు పోటెత్తాయని అధికారులు చెబుతున్నారు. నదుల్లో నీటి మట్టాలు అమాంతం పెరిగిపోవడం వల్లే వరదలు ముంచెత్తాయన్నారు. వరదల నుంచి కాపాడాలంటూ గురువారం నుంచి రాష్ట్ర అత్యవసర సేవల విభాగానికి దాదాపు 7 వేల ఫోన్లు వచ్చాయని అధికారులు చెప్పారు.
ప్రస్తుతం సిడ్నీ సహా వివిధ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వానలు పడుతున్నాయని, ఆదివారం 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, వరదల కారణంగా కరోనా టీకా (Covid vaccines in Sydney) కార్యక్రమానికి అంతరాయం కలుగుతోంది. రాబోయే కొన్ని వారాల్లో 60 లక్షల మందికి టీకా వేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించడం లేదని, ఎక్కడికక్కడ వ్యాక్సిన్ల సరఫరా ఆగిపోయిందని న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ గ్లేడిస్ బర్జీక్లియన్ అన్నారు. సుమారు 150 మంది రాత్రిపూట స్థానిక ఆడిటోరియంలో పడుకున్నారు, ఇది గతంలో బుష్ఫైర్ల నుండి పారిపోతున్న ప్రజలకు ఆశ్రయం కల్పించింది.