Karachi, Mar 21: ప్రపంచవ్యాప్తంగా కరోపావైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ అంతగా పరభావం చూపించడం లేదు. పైగా కరోనా సెకండ్ వేవ్ ఛాయలు కనపడుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారు సైగం కరోనా బారీన పడుతున్నారు. తాజాగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా పాజిటివ్ (Pakistan PM and His Wife Bushra Bibi Test Positive for COVID) తేలింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాజిటివ్ రావడం విస్మయం కలిగిస్తోంది. దీంతో పాకిస్తాన్‌లో కలకలం రేపుతోంది.
ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తాజాగా చేసుకున్న పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పాక్ వైద్య శాఖ మంత్రి ఫైజల్ సుల్తాన్ ప్రకటించారు.పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు అని సుల్తాన్ తెలిపారు.అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న (After Getting Vaccinated) రెండు రోజులకే ఆయనకు పాజిటివ్ రేపడం ఆందోళన కలిగిస్తోంది.
అయితే చైనాకు సంబంధించిన వ్యాక్సిన్ ‘సినోవక్’ వ్యాక్సిన్ తొలి డోసు ఇమ్రాన్‌ఖాన్ తీసుకున్నారు. ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ పొందాలని సూచించారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా అధికారికంగా తెలిపింది. అయితే పాకిస్తాన్ ప్రధానికి పాజిటివ్ రావడం.. చైనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కరోనా సోకడంతో సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు వస్తున్నాయి. చైనా వస్తువుల మాదిరి వ్యాక్సిన్ కూడా నాసిరకం అని కామెంట్స్ చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,876 మందికి పాజిటివ్ వచ్చినట్లు, 42 మంది మరణించారని ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా వైరస్ మహామ్మారి బారిన పడిన దాయాది దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కోవిడ్ నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
Here;s Pakistan PMO Tweet
وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ°
And when I am ill, it is He Who cures me.
(Qur’an 26:80)
Prime Minister Imran Khan has tested positive for Covid-19 and is self isolating at home.
— Prime Minister's Office, Pakistan (@PakPMO) March 20, 2021
ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిసార్టులో కరోనా కలకలం సృష్టించింది. ట్రంప్‌కు ఫ్లోరిడాలో మార్ ఏ లాగో అనే రిసార్టు ఉన్నది. అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో రిసార్టును పాక్షికంగా మూసివేశారు. అయితే ఎంత మందికి కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని క్లబ్ మేనేజ్‌మెంట్ స్పష్టంగా వెల్లడించడంలేదు.
ట్రంప్ జనవరిలో అధ్యక్షపదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి ఈ రిసార్టు అధికార నివాసంగా ఉన్నది. ‘రిసార్టులోని కొంతమంది ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో బీచ్ క్లబ్, లా కార్ట్ డైనింగ్ రూమ్‌లో సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని’ క్లబ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. సీడీసీ నిబంధనలకు అనుగుణంగా బాన్‌క్వెట్, ఈవెంట్ సేవలు కొనసాగుతాయని తెలిపింది.