IPL Auction 2025 Live

Ayodhya Deepotsav 2019: 6 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య, గిన్నిస్ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం, దీపాలతో వెలుగులు విరజిమ్మిన సరయూ నదీ తీరం

ఏకంగా 6 లక్షల దీపాలను వెలిగించారు. దీపావళి వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన ‘దీపోత్సవం’ కన్నుల పండువగా సాగింది. యూపీ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.

ayodhya deepotsav 2019: History created in Ayodhya as nearly 6 lakh diyas lit up Saryu banks on Diwali (Photo_ANI)

Lucknow, October 27: అయోధ్యలోని సరయూ నది తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఏకంగా 6 లక్షల దీపాలను వెలిగించారు. దీపావళి వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన ‘దీపోత్సవం’ కన్నుల పండువగా సాగింది. యూపీ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. గత ఏడాది 3లక్షల 108 దీపాలను వెలిగించారు. ఈ ఏడాది అరు లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.రెండేళ్ల క్రితం 'దీపోత్సవం' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దీపాలను వెలిగించే కార్యక్రమం మొదలుపెట్టింది. ఏటేటా దీపాల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు.

ఈసారి సుమారు 6 లక్షల దీపాలను వెలిగించారు. సరయూ నది ఒడ్డుపై కట్టిన 'రామ్ కీ పౌడీ' ఈ దీపోత్సవానికి వేదిక అయింది. ఇక్కడ ఏ దిక్కున చూసినా దీపాలే కనిపిస్తున్నాయి.రామాయణంలోని అనేక ఘట్టాలను ప్రదర్శించేందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డు

సీఎం యోగి ఆదిత్యనాథ్, ఫీజీ రిపబ్లిక్ డిప్యూటీ స్పీకర్ వీణ భట్నాగల్, యూపీ మంత్రులు పాల్గొననున్న అయోధ్య దీపోత్సవంలో శనివారం ఉదయం ప్రారంభమైన ఊరేగింపులో దేశంలోని నలుమూలల నుంచి కళాకారులు, ఏడు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 2,500 మంది విద్యార్థులు రాముడి జీవితంలోని ఘట్టాలతో చిత్రాలు గీశారు. ఈ సందర్భంగా రూ.226 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం యోగి ప్రారంభించారు. ఈ అయోధ్య దీపోత్సవాన్ని యూపీ సర్కారు రాష్ట్ర పండగగా ప్రకటించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది.

దీపాల వెలుగుల్లో అయోధ్య

రామజన్మభూమి అయిన అయోధ్యలోని సరయూ నది తీరంలో కనిపించిన ఈ దృశ్యాన్ని చూడానికి భక్తులకు రెండు కళ్లూ చాలలేదు. అందుకే రామ్‌ కీ పైడీ ఘాట్‌లో యూపీ ప్రభుత్వం నిర్వహించిన ఈ దీపోత్సవం గిన్నిస్‌ బుక్‌లో సైతం స్థానం సంపాదించుకుంది.

రామ్‌ కీ పైడీ ఘాట్‌

సరయూ నది తీరంలో గత ఏడాది జరిగిన దీపోత్సవంలో 3 లక్షల ఒక వేయి నూట పదహారు దీపాలను వెలిగించారు. దీంతో అప్పట్లో అది సరికొత్త ప్రపంచ రికార్డుగా అవతరించింది. ఈ సారి 6 లక్షల దీపాలను వెలిగించి, పాత రికార్డును బ్రేక్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది యూపీ ప్రభుత్వం. అనుకున్నట్టుగానే ఆ లక్ష్యాన్ని సాధించింది. దీంతో సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు ప్రకటించారు.

6 లక్షల దీపాలతో వెలుగులు

4 లక్షల దీపాలకు అదనంగా మరో 2 లక్షలకు పైగా దీపాలను సరయూ ఘాట్‌లపై వెలిగించారు భక్తులు. దీంతో ఈ సారి సరయూ తీరంలో ఆరు లక్షలకు పైగా మట్టి దీపాలు దేదీప్యమానంగా వెలిగాయి. దీపావళి వేడుకల్లో భాగంగా సరయూ నదీ తీరంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.