Botswana Diamond: బోట్స్ వానా గనిలో 2,492 క్యారెట్ల భారీ వజ్రం గుర్తింపు.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం ఇదేనోచ్..!
దీని బరువు 2,492 క్యారెట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.
Newdelhi, Aug 23: బోట్స్ వానాలోని సుప్రసిద్ధ వజ్రాల గని (Botswana Diamond) కరోవేలో ఓ భారీ వజ్రం దొరికింది. దీని బరువు 2,492 క్యారెట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఎక్స్-రే టెక్నాలజీ సహాయంతో ఈ వజ్రాన్ని గుర్తించినట్లు కెనడియన్ మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ కార్పొరేషన్ తెలిపింది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాలన్నీ ఇక్కడ దొరికినవే కావడం విశేషం.
దక్షిణ ఈయూ దేశాలను వణికిస్తున్న ‘గోట్ ప్లేగ్’ వ్యాధి.. మనుషులకు సోకే ప్రమాదం ఉందా??
రెండో అతిపెద్ద వజ్రం
దక్షిణాఫ్రికాలో 1905లో 3,106 క్యారెట్ల కలినన్ వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని ముక్కలుగా చేసి వాటిలో కొన్నింటిని బ్రిటిష్ క్రౌన్ ఆభరణాల్లో ఉంచారు. ఇక, కరోవే గనిలో 2019లో దొరికిన 1,758 క్యారట్ల సెవెలో వజ్రం ఇప్పటి వరకు రెండో అతి పెద్ద వజ్రంగా రికార్డుల్లో ఉండేది. అయితే, బోట్స్ వానాలో దొరికిన తాజా వజ్రం ఇప్పుడు ఆ రెండో స్థానాన్ని (World's second-biggest Diamond) ఆక్రమించేసింది.
మోదీజీ..కామాంధులకు వెంటనే శిక్ష పడేలా కఠినమైన చట్టం తీసుకురండి, ప్రధాని మోదీకి దీదీ లేఖ