Kolkata, August 22: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ (CM Mamata Banerjee writes to PM Modi) రాశారు.దేశంలో మహిళలపై జరుగుతోన్న అత్యాచార ఘటనలను మీ దృష్టికి తీసుకురావాలనుకొంటున్నా.
అనేక సందర్భాల్లో మహిళలు హత్యాచారాలకు గురవుతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 90 అత్యాచార ఘటనలు జరుగుతుండటం భయానక పరిస్థితిని సూచిస్తోంది. ఇలాంటి చర్యలు సమాజం, దేశం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఈ దురాగతాలకు ముగింపు పలకడం ద్వారా మహిళలు తాము సురక్షితంగా, భద్రంగా ఉన్నామని భావించేలా చేయడం మనందరి కర్తవ్యం’’ అని లేఖలో పేర్కొన్నారు. కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై సుప్రీంకోర్టుకు రిపోర్టు ఇచ్చిన సీబీఐ, దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు..
సీఎం లేఖ రాసినట్లు ఆమె ముఖ్య సలహాదారు బందోపాధ్యాయ ధృవీకరించారు. దేశవ్యాప్తంగా నిత్యం జరుగుతున్న అత్యాచార కేసులను ప్రధాని దృష్టికి మమత తీసుకు వెళ్లారని బందోపాధ్యాయ తెలిపారు.
దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని మమతా బెనర్జీ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మన దేశం, సమాజ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. ఇలాంటి దురాఘతాలకు ముగింపు పలకడం ద్వారా మహిళలు తాము సురక్షితంగా, భద్రంగా ఉన్నామని భావించేలా చేయడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. రండి 20 రూపాయలు ఇచ్చినా మీతో పడుకుంటాం, ఈ దారుణాలెందుకు, కామాంధులకు సూటి ప్రశ్నలు సంధించిన సెక్స్ వర్కర్, వీడియో ఇదిగో
ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి తగిన శిక్షను విధించేలా కఠినమైన చట్టం తీసుకురావడం ద్వారా తీవ్రమైన, సున్నితమైన ఈ సమస్యను సమగ్ర పద్ధతిలో పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కేసుల్లో సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ప్రతిపాదిత చట్టంలో చేర్చాలన్నారు. సత్వర న్యాయం కోసం విచారణను 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం (Kolkata Rape-Murder Case), హత్య వ్యవహారం, ఆ తర్వాత ఆస్పత్రిలో జరిగిన విధ్వంసం వంటి పరిణామాలతో మమతా బెనర్జీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.