Tom Moore Dies: కరోనాపై పోరాడిన యోధుడు చివరకు దానికే బలయ్యాడు, కోవిడ్‌పై పోరు కోసం రూ.318 కోట్ల విరాళాలను సేకరించిన కెప్టెన్‌ టామ్‌ మూర్‌ కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన పలువురు

మన దేశంలో అంతగా తెలియకపోవచ్చు కాని బ్రిటన్ లో కరోనా వ్యాప్తి ప్రారంభం కాగానే, దాన్ని ఎదుర్కొనేందుకు 32 మిలియన్‌ పౌండ్లు విరాళాల ద్వారా సేకరించారు. వందేండ్ల వయసులో బ్రిటన్ ను వణికిస్తున్న కరోనాను తరిమికొట్టేందుకు రూ.318 కోట్లను సేకరించి హీరో అయ్యాడు. అయితే ఆ యోధుడు చివరకు అదే కరోనాకు (Tom Moore Dies) బలయ్యాడు.

Captain Sir Tom Moore (Photo Credits: Twitter)

London, February 3:  బ్రిటన్ సైనిక మాజీ కెప్టెన్‌ టామ్‌ మూర్‌ గురించి ఎవరికీ పరిచయం అక్కర లేదు. మన దేశంలో అంతగా తెలియకపోవచ్చు కాని బ్రిటన్ లో కరోనా వ్యాప్తి ప్రారంభం కాగానే, దాన్ని ఎదుర్కొనేందుకు 32 మిలియన్‌ పౌండ్లు విరాళాల ద్వారా సేకరించారు. వందేండ్ల వయసులో బ్రిటన్ ను వణికిస్తున్న కరోనాను తరిమికొట్టేందుకు రూ.318 కోట్లను సేకరించి హీరో అయ్యాడు. అయితే ఆ యోధుడు చివరకు అదే కరోనాకు (Tom Moore Dies) బలయ్యాడు.

ఆయన వయసు 100 సంవత్సరాలు. టామ్ మూరే (Captain Sir Tom Moore) చనిపోయారని ఆయన కుటుంబీకులు పేర్కొన్నారు. "సెంచరీ హీరో టామ్ మూరే ఇక లేరు. 1920-2021" అంటూ ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటన చేశారు. టామ్ మూరే మరణంపై పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. తన జీవితాంతం ఆయన బ్రిటన్ మేలు కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

బ్రిటన్ లో కరోనా వ్యాప్తి ప్రారంభం కాగానే, దాన్ని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ సమయంలో ఫండ్ రైజింగ్ ఆలోచన చేసిన తొలి వ్యక్తిగా ఆయన పేరు సుపరిచితం. మిలియన్ డాలర్ల నిధిని సేకరించి, కరోనాపై పోరుకు తనవంతు సాయాన్ని చేసిన టామ్ మూరే, చివరకు అదే మహమ్మారి బారిన పడి కన్నుమూయడం (Captain Sir Tom Moore Dies at 100) విషాదకరం.

ఒకే వ్యక్తిలో రెండు రకాల కరోనావైరస్‌లు, నివ్వెరపోతున్న శాస్త్రవేత్తలు, బ్రెజిల్‌లో పీ1, పీ2 కరోనా రకాలు గుర్తింపు, ఇండియాలో తాజాగా 11,039 మందికి కోవిడ్, ఏపీలో 104 మందికి కరోనా పాజిటివ్

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారత్‌లో బ్రిటిష్‌ సైన్యంలో ఆయన సేవలందించారు. వయసు మీద పడటంతో కదలేని స్థితిలో ఉన్న ఆయన గతేడాది కరోనాపై పోరులో భాగంగా విరాళాల కోసం ఊతకర్ర సాయంతో తన ఇంటి చుట్టూ 100 ప్రదక్షిణలు చేస్తానని సవాల్‌ విసిరి.. చెప్పినట్టు చేశారు. దాంతో ఆయన ఒక్కరోజులోనే బ్రిటన్‌ జాతీయ హీరో అయిపోయారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif