Bird Flu in Human: ప్రపంచంలో మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు, చిలీలో గుర్తించిన అధికారులు, తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలతో ఆస్పత్రికి..

చిలీ దేశంలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ తొలి కేసును గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 53 ఏళ్ల వ్యక్తిలో తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలు కనిపించాయని, పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలిందని చిలీ ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

Coronavirus Outbreak in China (Photo Credits: PTI)

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగు చూసింది. చిలీ దేశంలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ తొలి కేసును గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 53 ఏళ్ల వ్యక్తిలో తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలు కనిపించాయని, పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలిందని చిలీ ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన రోగితో కలిసి ఉన్న వారిని కూడా వైద్యులు పరిశీలిస్తున్నారు. చిలీ దేశంలోని అడవి జంతువుల్లో గత సంవత్సరం హెచ్ 5 ఎన్1 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.చిలీ దేశ పారిశ్రామిక క్షేత్రాల్లో కేసులు వెలుగు చూడటంతో ప్రభుత్వం పౌల్ట్రీ ఎగుమతులను నిలిపివేసింది.

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 3,016 మందికి కరోనా, గత 24 గంటల్లో 14 మంది మృతి, అత్యవసర సమావేశానికి ఢిల్లీ ప్రభుత్వం పిలుపు

అర్జెంటీనాలోని పారిశ్రామిక క్షేత్రాల్లోనూ కేసులు వచ్చాయి. కాగా, చిలీ ఆరోగ్య అధికారులు ఈ వైరస్ పక్షులు లేదా సముద్రపు క్షీరదాల నుంచి మానవులకు సంక్రమించవచ్చని గుర్తించారు. ఇది మనిషి నుంచి మనిషికి సంక్రమించిందా? అనే విషయంపై స్పష్టత లేదు.