Covid in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 3,016 మందికి కరోనా, గత 24 గంటల్లో 14 మంది మృతి, అత్యవసర సమావేశానికి ఢిల్లీ ప్రభుత్వం పిలుపు
Coronavirus (Photo-ANI)

New Delhi, Mar 30: దేశంలో (India) కరోనా వైరస్‌ (Corona Virus) భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు మూడు వేలకు పైనే నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,10,522 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,016 పాజిటివ్‌ కేసులు (Positive Cases) బయటపడ్డాయి.

ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. గతేడాది అక్టోబర్‌ 2వ తేదీన 3,375 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,12,692కి చేరింది. కాగా నిన్నటితో పోలిస్తే (నిన్న 2151 కేసులు) కొత్త కేసుల్లో 40 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక దేశంలో రోజూవారీ కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌లో 50 శాతం పెరుగుదల కనిపిస్తోంది.

భారీగా పెరగనున్న జ్వరం, బీపీ, రక్త హీనత, డయాబెటిస్‌, గుండె జబ్బుల మందుల ధరలు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..

ప్రస్తుతం దేశంలో 13,509 కేసులు యాక్టివ్‌ (Active Cases)గా ఉన్నాయి. ఇప్పటి వరకు 4,41,68,321 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 14 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒకరు, కేరళలో ఎనిమిది మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,30,862గా నమోదైంది.

ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో (Positive Cases)0.03 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.78 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 (220,65,92,481) కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry) వెల్లడించింది.

యూపీఐ పేమెంట్స్ అలర్ట్, రూ.2 వేల పైన అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే 1.1 శాతం కట్, అయితే ఎవరికి వర్తిస్తుందో ఓ సారి చెక్ చేసుకోండి

బుధవారం ఢిల్లీలో 300 కొత్త కేసులు వెలుగు చూడడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఢిల్లీ ఆరోగ్య సౌరభ భరద్వాజ్ ఆధ్వర్యంలో ఈ సమావేశంలో వైద్య నిపుణులు, వైద్య శాఖ అధికారులు పాల్గొంటారు.