Covid Cases in China: చైనాలో కరోనా విజృంభణ, రోజుకు 10 లక్షల కరోనా కేసులు, 5 వేల మరణాలు, రానున్న రోజుల్లో ఈ సంఖ్య 42 లక్షలకు చేరుకుంటుందని వార్తలు
ప్రస్తుతం ప్రతి రోజూ చైనాలో 10 లక్షల కేసులు (1 Million COVID Cases ) వెలుగులోకి వస్తున్నాయని, 5 వేల మంది ప్రాణాలు (5000 Deaths a Day) కోల్పోతున్నారని లండన్‌కి చెందిన సంస్థ ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ అంచనా వేసింది.
Beijing, Dec 23: చైనాలో జీరో కోవిడ్ విధానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో కరోనా మహమ్మారి చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఎఫ్.7 చైనా వాసులకు కంటి మీద కనుకులేకుండా చేస్తోంది. ప్రస్తుతం ప్రతి రోజూ చైనాలో 10 లక్షల కేసులు (1 Million COVID Cases ) వెలుగులోకి వస్తున్నాయని, 5 వేల మంది ప్రాణాలు (5000 Deaths a Day) కోల్పోతున్నారని లండన్‌కి చెందిన సంస్థ ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ అంచనా వేసింది.
రానున్న కాలంలో ఈ సంఖ్య మరింతగా (China Covid surge) పెరిగిపోతుందని జనవరిలో రోజువారీ కేసులు 37 లక్షలకు (Covid Cases in China) చేరుకుంటాయని, మార్చి నాటికి కరోనా మరింతగా విజృంభించి ప్రతీ రోజూ 42 లక్షల కేసులు నమోదవుతాయని ఎయిర్‌ఫినిటీ సంస్థ తాజా నివేదికలో హెచ్చరించింది.జిన్‌పింగ్ ప్రభుత్వం కరోనా కేసుల్ని బాగా తక్కువ చేసి చూపిస్తోందని నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో అమెరికాలో ఒమిక్రాన్ వేరియెంట్‌తో రోజుకి 14 లక్షల కేసులు నమోదయ్యాయని, అలాంటప్పుడు చైనాలో రోజుకి 30 లక్షలు కేసులు నమోదు కావడం సాధారణమేనని ఆ నివేదిక గుర్తు చేసింది.
చైనాలో ఒక్కరోజే 3,89,306 కేసుల్లో కరోనా లక్షణాలు, రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు, వీడియో ఇదే
చైనా ప్రభుత్వం లెక్కల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 3 వేల కేసులు నమోదైతే, ఒక్కరు కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోలేదు. మరోవైపు చైనాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయని, కరోనా పరీక్షలు చేయడం కూడా సాధ్యం కాక ప్రభుత్వం చేతులెత్తేసిందని బ్లూమ్‌బర్గ్ వంటి మీడియా సంస్థలు వీడియోలతో సహా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఆస్పత్రుల్లో చేరేవారిలో ఎక్కువ మంది వృద్ధులే ఉంటున్నారు. వైద్య సిబ్బంది కరోనాతో బాధపడుతూనే తమ విధుల్ని నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
కోవిడ్ కల్లోలం, ఉచితంగా యాంటీ ఫీవర్ డ్రగ్స్ సరఫరా, కీలక నిర్ణయం తీసుకున్న చైనా ప్రభుత్వం
చైనాలో కరోనా పరిస్థితిపై జిన్‌పింగ్ ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించకపోవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ జ్వరం మందులకి కూడా కొరత ఏర్పడిందని తెలిపింది. చైనా ఇప్పటికైనా కచ్చితమైన డేటా వెల్లడించి కరోనా కట్టడికి పరిష్కార మార్గాలు చూడాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయేసస్ హితవు పలికారు.