చైనాను కరోనా వైరస్ వేరియంట్స్ టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. కొత్త వేరియంట్ బీఎఫ్-7 కారణంగా చైనాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.మంగళవారం చైనాలో 3,89,306 కేసుల్లో కరోనా లక్షణాలు గుర్తించామని అధికార వర్గాలు తెలిపాయి. చైనాలో కొవిడ్-19 కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో పలు సిటీల్లో ప్రజలకు ఉచితంగా యాంటీ ఫీవర్ డ్రగ్స్ అందిస్తున్నారు.
చైనాలో కరోనా నూతన వేరియంట్ వేగంగా ప్రబలుతుండటంతో ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. స్పెషల్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయడంతో మందుల తయారీ, సరఫరాను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. మరోవైపు వైరస్ వ్యాప్తితో బీజింగ్, వుహాన్, షెంజెన్, షాంఘై నగరాల్లో స్ధానిక ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా యాంటీ ఫీవర్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాయి.
Here's Video
Emergency room of a hospital in #Tianjin City of China…
#COVID #chinacovid #COVID19 #coronavirus #China #CovidIsNotOver #CovidIsntOver pic.twitter.com/SC24pnmDZO
— Jyot Jeet (@activistjyot) December 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)