China Horror: పక్కింటివానిపై పగతో పాడు పని, రాత్రిపూట 1100 కోళ్లను దారుణంగా ఫ్లాష్ లైట్ వేసి చంపేసిన చైనీయుడు, నిందితుడుకి జైలు శిక్ష విధించిన చైనా కోర్టు
కాగా పక్కింటి వ్యక్తిపై ప్రతీకారంతో ఓ వ్యక్తి విచిత్ర చర్యకు అతను పాల్పడ్డాడని కోర్టు తెలిపింది.చైనాలో గూ, జోంగ్ అనే ఇద్దరు పక్కపక్క ఇళ్లలో నివసిస్తారు.
Chinese Man Gets 6 Months In Jail: తన పొరుగువారికి చెందిన 1,100 కోళ్లను భయపెట్టి చంపినందుకు దోషిగా తేలినందుకు చైనాలో ఒక వ్యక్తికి జైలు శిక్ష విధించబడిందని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. కాగా పక్కింటి వ్యక్తిపై ప్రతీకారంతో ఓ వ్యక్తి విచిత్ర చర్యకు అతను పాల్పడ్డాడని కోర్టు తెలిపింది.చైనాలో గూ, జోంగ్ అనే ఇద్దరు పక్కపక్క ఇళ్లలో నివసిస్తారు.
గతేడాది ఏప్రిల్‌లో జోంగ్.. గూ అనుమతి లేకుండా అతని చెట్లను నరికివేశాడు. అప్పటి నుంచి గూ పగ పెంచుకున్నాడు. ఈ పగలో భాగంగా తరచూ జోంగ్‌కు చెందిన కోళ్ల ఫాంకు రాత్రివేళల్లో వెళ్లి వాటిని ఎలా చంపాలా అని ఆలోచించేవాడు. కొద్ది రోజుల క్రితం ఓ రాత్రి జోంగ్ కోళ్ల ఫాం వద్దకు వెళ్లిన గూ.. సడన్‌గా ఫ్లాష్‌లైట్ ఆన్ చేశాడు. దీంతో కోళ్లు భయభ్రాంతులకు గురై అన్నీ ఓ మూలకు వెళ్లాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి పడి దాదాపు 500 కోళ్లు చనిపోయాయి.
జోంగ్ ఫిర్యాదు మేరకు గూను పోలీసులు అరెస్టు చేశారు. 500 కోళ్ల మరణానికి కారణమైనందుకు అతనికి రూ.35,713 జరిమానా కూడా విధించారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన గూ.. తన పగ చల్లారకపోవడంతో మరోసారి రాత్రివేళ కోళ్లఫాంకు వెళ్లి మళ్లీ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఈ సారి దాదాపు 640 కోళ్లు మరణించాయి. పోలీసులు మళ్లీ అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
గూ కావాలనే జోంగ్ కోళ్లను చంపి నష్టం కలిగేలా చేశాడని కోర్టు నిర్ధరించింది. కోర్టు అతనికి ఒక సంవత్సరం పరిశీలనతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నేరాల పట్ల పశ్చాత్తాపం చూపినందున మిస్టర్ గుకు ఈ శిక్ష విధించబడింది. చనిపోయిన 1,100 కోళ్ల విలువ రూ.1,60,000కు పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.