మద్యానికి బానిసైన పెంపుడు కుక్క ఇటీవలే ఆ వ్యసనం నుంచి బయటపడిన ఉదంతం బ్రిటన్‌లో వెలుగు చూసింది. ప్లిమొత్ ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో అతడు కుక్కకు కూడా మద్యం అలవాటు చేయడంతో యజమాని మరణించాక శునకం తీవ్ర అనారోగ్యం పాలైంది. ఇది గమనించిన స్థానికులు.. కుక్కను జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. ఆ కుక్కకు తరచూ ఫిట్స్ వచ్చేవి. అనేక ఇతర సమస్యలతోనూ సతమతమయ్యేది. ఈ రోగ లక్షణాలను పరిశీలించిన వైద్యులు అది మద్యానికి బానిసైందని గుర్తించి చికిత్స ప్రారంభించారు. ఇటీవలే అది కోలుకుంది. అయితే.. ఓ కుక్క మద్యానికి బానిసై కోలుకోవడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని భావిస్తున్నారు.
Here's Update
A dog in the UK's #Plymouth who had become "dependent" on #alcohol is the first canine to be treated for alcohol addictionhttps://t.co/QdUAFOCnC1
— IndiaToday (@IndiaToday) April 11, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)