Chinese Troops Attack Filipino Navy Boats: దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్ బోట్లపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసిన చైనా సైనికులు, వీడియో ఇదిగో..
ఫిలిప్సీన్ బోట్ల నుంచి రైఫిల్స్ ఇతర సామగ్రిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది.
దక్షిణ చైనా సముద్రంలో చైనా కోస్ట్‌గార్డ్ సిబ్బంది ఫిలిప్సీన్ నేవీ బోట్లపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. ఫిలిప్సీన్ బోట్ల నుంచి రైఫిల్స్ ఇతర సామగ్రిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీనిపై ఫిలిప్పీన్స్ అధికారులు స్పందిస్తూ.. తమ నౌకాదళానికి చెందిన రెండు బోట్లు సెకండ్ థామస్ షోల్‌కు ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా చైనా దళాలు దాడి చేసినట్లు వెల్లడించారు.
ఫిలిప్పీన్స్ సమీపంలోని సెకండ్ థామస్ షోల్ ప్రాంతం తమదేనని ఎప్పటి నుంచో చైనా వాదిస్తోంది. అక్కడ మోహరించిన ఫిలిప్పీన్స్ నౌకా దళాలకు ఆహారం, ఆయుధాలు, ఇతర సామగ్రిని చేరవేస్తున్న ఫిలిప్సీన్స్ నేవీ బోట్లపై చైనా కోస్ట్‌గార్డ్ దళాలు దాడి చేశాయి.బీజింగ్ దళాలు తొలుత ఫిలిప్పీన్స్ దళాలతో వాదనకు దిగి.. అనంతరం ఆ బోట్లలోకి చొరబడ్డాయి. భారత్‌ను వదిలేస్తున్న 4,300 మంది మిలియనీర్లు, హెన్లీ అండ్ పార్టనర్స్ రిపోర్టు-2024లో సంచలన విషయాలు
మనీలా పడవల్లో ఉన్న బాక్సుల్లోని ఎం4 రైఫిల్స్‌ను వారు స్వాధీనం చేసుకొన్నారు. వీటితోపాటు అక్కడే ఉన్న నేవిగేషన్ పరికరాలను కూడా సీజ్ చేశారు. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడి బొటనవేలు తెగిపోయింది. పడవలు ఎటూ కదలకుండా చైనా దళాల పడవలు చుట్టుముట్టాయని ఫిలిప్పీన్స్ సాయుధ దళాధిపతి జనరల్ రోమియో బ్రానర్ జూనియర్ తెలిపారు. చైనా సైనికులు సముద్రపు దొంగల మాదిరిగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. తమ బోట్ల నుంచి స్వాధీనం చేసుకున్న రైఫిల్స్, నేవిగేషన్ పరికరాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోట్లకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరారు.
Here's Videos
మరోవైపు చైనా విదేశాంగశాఖ ఈ ఘర్షణపై స్పందించింది. ‘‘చైనా కోస్ట్‌గార్డ్ దళాలు చట్టపరమైన చర్యలు తీసుకొని.. ఫిలిప్పీన్స్ పడవలో అక్రమ ఆయుధ సరఫరాను అడ్డుకొన్నాయి. ఆ దేశ సైనికులపై ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదు’’ అని పేర్కొంది. కోస్ట్‌గార్డ్ చట్టంలో సరికొత్త నిబంధనను డ్రాగన్ గత శనివారం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను బీజింగ్ బలగాలు 30 నుంచి 60 రోజులపాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది. ఈ చట్టం కల్పించిన అధికారాలతోనే చైనా తీర రక్షక సిబ్బంది తాజాగా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.