WHO on COVID-19: హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్ 19 మనతో ఉంటుంది, కలిసి జీవించడం నేర్చుకోవాలి, దేశాల‌న్నీ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి, హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

నోవల్ క‌రోనా వైర‌స్ (Novel Coronavirus) ఎక్క‌డికీ వెళ్ల‌దని, దాంతో క‌లిసి జీవించ‌డం మ‌నుషులు నేర్చుకోవాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు స్వ‌ల్పంగా లాక్‌డౌన్ ఎత్తివేస్తున్న నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్‌వో ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. బ‌హుశా క‌రోనా వైర‌స్ శాశ్వ‌తంగా అంతం కాదు అన్న సంకేతాన్ని డ‌బ్ల్యూహెచ్‌వో వినిపించింది. . లాక్‌డౌన్ (Lockdown) ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న దేశాల‌న్నీ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ తెలిపారు.

World Health Organization (File Photo)

Geneva, May 14: కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) సంచలన వ్యాఖ్యలు చేసింది. నోవల్ క‌రోనా వైర‌స్ (Novel Coronavirus) ఎక్క‌డికీ వెళ్ల‌దని, దాంతో క‌లిసి జీవించ‌డం మ‌నుషులు నేర్చుకోవాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు స్వ‌ల్పంగా లాక్‌డౌన్ ఎత్తివేస్తున్న నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్‌వో ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. బ‌హుశా క‌రోనా వైర‌స్ శాశ్వ‌తంగా అంతం కాదు అన్న సంకేతాన్ని డ‌బ్ల్యూహెచ్‌వో వినిపించింది. . లాక్‌డౌన్ (Lockdown) ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న దేశాల‌న్నీ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల్లో జీరో కేసులు, దేశ వ్యాప్తంగా 78 వేలు దాటిన కరోనా కేసులు, ప్రపంచవ్యాప్తంగా 45 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మృతుల సంఖ్య 3 లక్షలకు చేరువలో..

జెనీవాలో మీడియాతో మాట్లాడిన ర్యాన్‌.. ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న హెచ్ఐవీ మాదిరిగానే కరోనా వైరస్ కూడా ఎప్పటికీ పోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైక్ ర్యాన్ (Michael Ryan) చెప్పారు. కరోనా వైరస్ సమాజంలో మరో స్థానిక వైరస్ గా మారవచ్చని, ఈ వైరస్ ఎప్పటికీ దూరం కాకపోవచ్చని డాక్టర్ మైక్ ర్యాన్ వ్యాఖ్యానించారు. ప్ర‌పంచ జ‌నాభాలోకి కొత్త‌గా వైర‌స్ ప్ర‌వేశించింద‌ని, అయితే ఎప్పుడు ఆ వైర‌స్‌ను జ‌యిస్తామ‌న్న విష‌యాన్ని ఇప్పుడే అంచ‌నా వేయ‌లేమ‌ని తెలిపారు. వలస కూలీల ఘోషలో ఓ పేజీ, 9 నెలల గర్బిణీ 70 కిలోమీటర్లు నడిచింది, మార్గం మధ్యలో ప్రసవం, మళ్లీ బిడ్డను ఎత్తుకుని 160 కిలోమీటర్లు నడిచింది

హెచ్ఐవీ ప్రపంచం నుంచి ఎప్పుడు మాయమవుతుందో ఎవరికీ తెలియదని, దీనిలాగానే కరోనా వైరస్ కు కూడా అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్ ను కనుగొనగలిగితే దాన్ని నివారించగలుగుతామని మైక్ ర్యాన్ చెప్పారు. కరోనా వైరస్ ఎప్పుడు మాయమవుతుందో తమకు తెలియదని, దీనికి ప్రభావవంతమైన వ్యాక్సిన్ ను కనుగొనగలిగి, దాన్ని ప్రతీ ఒక్కరికీ పంపిణీ చేయగలిగితే ఈ వైరస్ ను అరికట్టవచ్చని డాక్టర్ మైక్ ర్యాన్ వివరించారు. ఈ వైర‌స్ మ‌న జీవితాల్లో భాగ‌స్వామ్యం అవుతుంద‌ని, ఇక వైర‌స్ ఇప్ప‌ట్లో వెళ్లే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు.