Image Used For Representative Purpose Only. | File Photo

New Delhi, May 14: దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) పెరుగుతూ ఉన్న‌ది. ప్ర‌తిరోజూ వేల‌ల్లో కొత్త కేసులు (coronavirus cases), వంద‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి గురువారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు కేవ‌లం 24 గంట‌ల వ్య‌ధిలో కొత్త‌గా 3,722 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 78,003కు చేరింది. వలస కూలీల ఘోషలో ఓ పేజీ, 9 నెలల గర్బిణీ 70 కిలోమీటర్లు నడిచింది, మార్గం మధ్యలో ప్రసవం, మళ్లీ బిడ్డను ఎత్తుకుని 160 కిలోమీటర్లు నడిచింది

గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే అన్ని రాష్ట్రాల్లో క‌లిపి 134 క‌రోనా మ‌ర‌ణాలు (Coronavirus Deaths) సంభ‌వించాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 2,549కి చేరింది. కాగా, దేశంలో న‌మోదైన మొత్తం కేసుల‌లో ప్ర‌స్తుతం 49,219 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగ‌తా వారిలో 26,235 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 2549 మంది మ‌ర‌ణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ 4కు సిద్ధమవండి, మే 18లోపు పూర్తి వివరాలు, కరోనాపై పోరాటంలో అలసిపోవద్దు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా 509 మందికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. ఇందులో 380 కేసులు చెన్నైలోనే నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం సాయంత్రం ప్రకటించింది. దీనితో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 9227కి పెరిగింది. చెన్నైలో కేసుల సంఖ్య 5262కు పెరిగింది. బుధవారం కరోనా మహమ్మారికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఈ వైరస్‌ సోకి మృతి చెందినవారి సంఖ్య 64కు పెరిగింది. గత మూడు రోజులుగా 669, 798, 716 పాజిటివ్‌ కేసులు నమోదవుతూ వచ్చి బుధవారం ఉన్నట్టుండి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఎంఎస్‌ఎంఈలకు కొత్త అర్థం,ఈపీఎఫ్ చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు, రూ. 20 కోట్ల ఆర్థిక ప్యాకేజీ పూర్తి వివరాలు ఇవే

ఛత్తీస్‌గఢ్, మణిపూర్, మేఘాలయ, గోవా, లద్దాఖ్, మిజోరం, అండమాన్, నికోబార్‌ సహా 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. సిక్కిం, నాగాలాండ్, డయ్యూ డామన్, లక్షద్వీప్‌ల్లో ఇప్పటివరకు కేసులేమీ నమోదు కాలేదన్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఇండోర్ జిల్లాలో బుధ‌వారం ఒక్క రోజే 131 పాజిటివ్ కేసులు న‌మోదయిన‌ట్లు ఇండోర్ చీఫ్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీసర్ ప్ర‌వీణ్ జాండియా తెలిపారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2238కు చేరుకుంది. ఒక‌రు మృతి చెంద‌గా..మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 96 కు చేరుకున్న‌ట్లు వెల్ల‌డించారు. హాట్ స్పాట్లు, కంటైన్ మెంట్ జోన్లు మిన‌హా మిగిలిన ప్రాంతాల్లో ప్ర‌భుత్వం కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింది .

మహారాష్ట్రలో ఇప్పటివరకు 25,922 పాజిటివ్ కేసులు, 975 మంది మృతి చెందారు, గుజరాత్‌లో 9,267 పాజిటివ్ కేసులు, 566 మంది మృతి, తమిళనాడులో 9,227 పాజిటివ్ కేసులు, 64 మంది మృతి, ఢిల్లీలో 7,998 పాజిటివ్ కేసులు, 106మంది మృతి చెందారు.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 44.24 లక్షలు దాటాయి. ఇప్పటివరకు కరోనాతో 2.97 లక్షల మందికి పైగా మృతిచెందారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 16.55 లక్షల మంది కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. అక్కడ 14,29,709 పాజిటివ్ కేసులు నమోదు కాగా 85,171 మంది మృతి చెందారు. తరువాత స్పెయిన్‌ లో 2,71,095 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 27,104 మంది మృతి చెందారు. రష్యాలో కూడా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అక్కడ ఇప్పటిదాకా 2,42,271 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,212 మంది మృతి చెందారు.

వివిధ దేశాల కరోనా రిపోర్ట్

ఇంగ్లండ్‌: 2,29,705 పాజిటివ్ కేసులు, 33,186 మంది మృతి

ఇటలీ 2,22,104 పాజిటివ్ కేసులు, 31,106 మంది మృతి

బ్రెజిల్‌ 1,89,157 పాజిటివ్ కేసులు, 13,158 మంది మృతి

ఫ్రాన్స్‌ 1,78,060 పాజిటివ్ కేసులు, 27,074 మంది మృతి

జర్మనీ 1,74,098 పాజిటివ్ కేసులు, 7,861 మంది మృతి

టర్కీ 1,43,114 పాజిటివ్ కేసులు, 3,952 మంది మృతి

ఇరాన్‌ 1,12,725 పాజిటివ్ కేసులు, 6,783 మంది మృతి

చైనా 82,926 పాజిటివ్ కేసులు, 4,633 మంది మృతి

పెరు 76,306 పాజిటివ్ కేసులు, 2,169 మంది మృతి

కెనడా 72,278 పాజిటివ్ కేసులు, 5,302 మంది మృతి

బెల్జియం 53,981 పాజిటివ్ కేసులు, 8,843 మంది మృతి