Rs 20 Lakh Crore Package: ఎంఎస్‌ఎంఈలకు కొత్త అర్థం,ఈపీఎఫ్ చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు, రూ. 20 కోట్ల ఆర్థిక ప్యాకేజీ  పూర్తి వివరాలు ఇవే
New definition and criteria for MSMEs (Photo Credits: ANI)

New Delhi, May 13: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) నిర్వచనం (New Definition of MSMEs) మారింది.నూతన నిర్వచనం ప్రకారం రూ. కోటి పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 5 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మైక్రో ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. అదే రూ. 10 కోట్ల పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 50 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది స్మాల్‌ ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. అదేవిధంగా రూ. 20 కోట్ల పెట్టుబడితో ఉన్న సంస్థ రూ. 100 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మీడియం ఎంటర్‌ప్రైస్‌గా కేంద్ర ఆర్థికమంత్రి (FM Nirmala Sitharaman) పేర్కొన్నారు. ప్రధాని మోదీ 'ఆత్మ నిర్భర్' గుట్టు విప్పిన కేంద్ర ఆర్థికమంత్రి, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అంటే స్వయం ఆధారిత భారతం, ఉద్దీపన ప్యాకేజీ వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్

కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నిన్న ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై (Rs 20 Lakh Crore Package) కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు.

ఆర్థిక ఇబ్బందులతో కార్యకలాపాలు నిలిపివేసిన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం (MSMEs) ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండానే రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.3 లక్షల కోట్ల రుణాలను ఆమె ప్రకటించారు.అక్టోబర్ వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని నిర్మల స్పష్టం చేశారు. 12 నెలల మారిటోరియంతో ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రుణాల చెల్లింపునకు నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని పేర్కొన్నారు. . చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల కేటాయింపు, నగదు లభ్యత పెంచడమే ప్యాకేజీ లక్ష్యం, ఉద్దీపన చర్యల్లో భాగంగా 15 సహాయక చర్యలు

45 లక్షల పరిశ్రమలకు ఈ ఉద్దీపనతో ప్రయోజనం చేకూరునున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతేకాదు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఈక్విటీ నిధికి రూపకల్పన చేశామని, కార్యకలాపాలు విస్తరించి మెరుగైన అవకాశాలు అందుకునేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడమే ఈక్విటీ నిధి ఉద్దేశమని తెలిపారు. నేటి నుంచి ఒక్కొక్కటిగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.  రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

దీంతో పాటుగా పీఎం గరీభ్‌ కల్యాణ్‌ పథకం కింద పేదలు, వలస కూలీల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసినట్లు తెలిపారు. 41 కోట్ల జన్‌ ధన్‌ ఖాతాదారుల అకౌంట్‌లలో రూ. 52,606 కోట్లు జమచేసినట్లు చెప్పారు. అదేవిధంగా రూ. 18 వేల కోట్ల ఇన్‌కం టాక్స్‌ను తిరిగి చెల్లించినట్లు తెలిపారు. దీంతో 40 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు లబ్దిచేకూరినట్లు వివరించారు. ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, కుటీర, గృహ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు.  ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ, సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి, 21వ శతాబ్దం భారత్‌దేనని తెలిపిన ప్రధాని మోదీ

ఈపీఎఫ్ చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. బిజినెన్, వర్కర్ల ఈపీఎఫ్ కంటిబ్యూషన్‌ను మూడు నెలల పాటు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం రూ.6,750 కోట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు (లిక్విడిటీ సపోర్ట్) తెలిపారు. వచ్చే మూడు నెలల్లో వాణిజ్య కార్యకలాపాలు, ఉత్పత్తిని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. ఉద్యోగులు మరింత ఎక్కువ వేతనం ఇంటికి పట్టికెళ్లేలాచూడం, పీఎఫ్ బకాయిల చెల్లింపులో యాజమాన్యాలకు ఉపశమనం కలిగించడం అనివార్యమని అన్నారు. ఆ కారణంగానే ఉద్యోగులు, యజమానాలు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పీఎఫ్ కంటిబ్యూషన్‌ను ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 10 శాతానికి మూడు నెలల పాటు తగ్గిస్తున్నట్టు చెప్పారు.

అయితే సీపీఎస్ఈ, రాష్ట్ర పీఎస్‌యూలు ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కింద 12 శాతం చెల్లింపు కొనసాగుతుందని తెలిపారు. పీఎం గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద 24 శాతం ఈపీఎఫ్ సపోర్ట్‌ ఉన్న వర్కర్లకు మాత్రం ఈ స్కీమ్ వర్తించదని ఆమె చెప్పారు. ఈపీఎఫ్ఓ కిందకు వచ్చే 6.5 లక్షల సంస్థలకు, 4.3 కోట్ల ఉద్యోగులకు ఈ పథకం వల్ల ఉపశమనం కలుగుతుందని మంత్రి తెలిపారు. ఆ ప్రకారం యజమానులు, ఉద్యోగులకు రూ.750 కోట్ల మేరకు లిక్విడిటీ సపోర్ట్ 3 నెలల పాటు లభిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు

15వేల రూపాయలలోపు జీతం ఉన్న ఉద్యోగులకు కేంద్రం 24 శాతం పీఎఫ్ మొత్తం ఇవ్వనుంది. మూడు నెలల పాటు ఈ మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది. 3 లక్షలకు పైగా కంపెనీల్లో పనిచేసే 72 లక్షల మందికి దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.