COVID Outbreak in China: షాకింగ్ వీడియోలు, కరోనా శవాలతో నిండిపోయిన చైనా శ్మశాన వాటికలు, రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు, ప్రపంచానికి మరో వేవ్ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిక

కరోనావైరస్ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడగా చైనా మాత్రం దాని విశ్వరూపం (COVID Outbreak in China) చూస్తోంది.చైనాలో మరోసారి వైరస్ పంజా విసురుతుందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ ( epidemiologist estimates) హెచ్చరించారు.

Coronavirus Outbreak . (Photo Credits: AFP)

Beijing, Dec 20: కరోనావైరస్ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడగా చైనా మాత్రం దాని విశ్వరూపం (COVID Outbreak in China) చూస్తోంది.చైనాలో మరోసారి వైరస్ పంజా విసురుతుందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ ( epidemiologist estimates) హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతాయని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని ( Millions May Die) అంచనా వేశారు. చైనాతో పాటు ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు.

చైనాలో కరోనా కల్లోలంపై షాకింగ్ రిపోర్ట్, డ్రాగన్ కంట్రీకి మూడ్ వేవ్‌ల ముప్పు, 10 లక్షలకుపైగా మరణాలు సంభవించే అవకాశం, చైనా నిపుణుల అధ్యయనంలో వెల్లడి

చైనాలో కరోనా ఆంక్షలు ఇటీవలే ఎత్తివేశారు. దీంతో గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. గంటల్లోనే వైరస్ బాధితులు రెట్టింపు అవుతున్నారు. ఆస్ప్రత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే 90 రోజుల్లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో అత్యధికంగా 60 శాతం మందికి (60% Of China Likely To Get Covid) వైరస్ సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Here's Videos

మిగతా ప్రపంచ దేశాల్లో 10 శాతం మంది వైరస్ బారిన పడవచ్చని చెబుతున్నారు. కొత్త సంవత్సరం సమయానికి చైనాలో మరో కరోనా వేవ్ వస్తుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి కరోనా మూడో వేవ్ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. మరణాలు మిలియన్లలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వృద్ధుల టీకా రేటు, ఆసుపత్రులలో పెరుగుదల, ఇంటెన్సివ్ కేర్ సామర్థ్యాన్ని పెంచడంలో చైనా అధికారులు విఫలమయ్యారు, దేశంలోని 1.4 బిలియన్ పౌరులకు విపత్తు కలిగించే యాంటీవైరల్ మందులను నిల్వ చేయడంలో విఫలమయ్యారని నిపుణులు హెచ్చరించారు.

రోడ్డున పోయేవారికి ఎవరైనా ముద్దు పెట్టవచ్చు, చైనాలో ట్రెండ్ అవుతున్న మౌత్ బ‌డ్డీస్ డేటింగ్, కరోనా కల్లోలం వేళ ఈ కిస్సింగ్ ట్రెండ్ ఏంటని మండిపడుతున్న పలువురు

ఇప్పటికే, ఆసుపత్రులు నిండిపోయాయి. ఇంటెన్సివ్ కేర్ బెడ్‌లను ఏర్పాటు చేయడానికి. ఫీవర్ స్క్రీనింగ్ క్లినిక్‌లను నిర్మించడానికి ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే శ్మశాన వాటికలు 24 గంటల పాటు పనిచేస్తున్నాయి, కానీ ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న మృతదేహాలతో శ్మశాన వాటికలు నిండిపోయాయి.

జీరో విధానం ఎత్తివేసినప్పటి నుండి, బీజింగ్ సోమవారం రెండు కోవిడ్-సంబంధిత మరణాలను నివేదించింది, మంగళవారం ఐదు మరణాలు సంభవించాయి - వారాలలో మొదటి మరణాలు నమోదయ్యాయి. అయితే, మీడియా నివేదికలను ఉటంకిస్తూ, చైనా ప్రధాన భూభాగంలో మరణాలు చాలా తక్కువగా నివేదించబడుతున్నాయని ఫీగల్-డింగ్ పేర్కొన్నారు. ఈ లెక్కలు వాస్తవానికి చాలా దూరంలో ఉన్నాయని అక్కడ వేలల్లో మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు.