Kiss (Photo Credits: Pexels)

Beijing, Dec 20: చైనాలో ఇప్పుడు Mouth Buddies అనే డేటింగ్ అంశంలో కొత్త ట్రెండ్ న‌డుస్తోంది. దారిన పోయేవారంతా ఎక్కడికక్కడే ఒకరికొకరు ముద్దులు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఒకరికి ఒకరు తెలియకపోయినా అప‌రిచితులు కిస్సింగ్ ఇచ్చుకుంటున్నారు. దీన్నే అక్కడ మౌత్ బ‌డ్డీస్ లేదా జుయి యూ (Mouth Buddies or zui you) అని పిలుస్తున్నారని చైనా మీడియా చెబుతోంది. ఈ కిస్సింగ్ సంగతేమో కాని కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ కొత్త ట్రెండ్‌పై కొంద‌రు ఆందోళ‌న‌లు చెందుతున్నారు.

మౌత్ బ‌డ్డీ అంటే కేవ‌లం ముద్దులు ఇవ్వ‌డం మాత్ర‌మే అని, దీంట్లో ఎటువంటి రిలేష‌న్‌షిప్ కానీ, శృంగారం కానీ ఉండ‌ద‌ని స్థానిక మీడియా క‌థ‌నాలు చెబుతున్నాయి. కిస్సింగ్ సెష‌న్స్ ముగిసిన త‌ర్వాత చాలా వ‌ర‌కు జంట‌లు మ‌ళ్లీ భౌతికంగా క‌లుసుకోవ‌డం లేద‌ని వార్తలు ప్రచురిస్తున్నాయి.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సెక్స్ ఆడియో కాల్ లీక్, ప్రైవేట్ పార్ట్‌లు నొప్పితో ఉన్నాయంటున్న మహిళ, సోషల్ మీడియాలో ఆడియో వైరల్

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్ని ఎంజాయ్ చేయ‌డం (Involves Kissing A Stranger) ముఖ్య‌మ‌ని, పార్ట్న‌ర్‌కు కిస్ ఇవ్వ‌డం అంటే, ప్రేమించే వ్య‌క్తికి కిస్ ఇవ్వ‌డంలా అనిపిస్తుంద‌ని ఆ వ్య‌క్తి తెలిపారు. ముద్దులు ఇచ్చుకోవ‌డం వ‌ల్ల శారీర‌కంగా, మాన‌సికంగా ఫ్రీ అవుతామ‌ని, శృంగారంతో పోలిస్తే దీని వ‌ల్ల ( China's bizarre New Dating Trend) ఎటువంటి స‌మ‌స్య‌లు ఉండ‌వ‌న్నారు. అయితే కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో ఈ ట్రెండ్ ఏంటని కొందరు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

చైనా (China)లో ‘జీరో-కొవిడ్ (zero Covid)’ నిబంధనలను సడలించిన తర్వాత వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ బాధితులతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయయాని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు (epidemiologist) ఎరిక్‌ ఫీగెల్‌ డింగ్‌ వెల్లడించారు. వచ్చే మూడు నెలల్లో ఆ దేశంలో 60శాతం మందికి పైగా వైరస్‌ (Covid 19) బారిన పడతారని నిపుణులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

చైనాలో కరోనా కల్లోలంపై షాకింగ్ రిపోర్ట్, డ్రాగన్ కంట్రీకి మూడ్ వేవ్‌ల ముప్పు, 10 లక్షలకుపైగా మరణాలు సంభవించే అవకాశం, చైనా నిపుణుల అధ్యయనంలో వెల్లడి

ఇటీవల కాలంలో ఒక్క బీజింగ్‌లోనే రోజుల వ్యవధిలో 2700 మంది చనిపోయినట్లు హాంకాంగ్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. బీజింగ్‌లోని కొన్ని శ్మశానవాటికలు కొవిడ్‌ మృతులతో నిండిపోయాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. రోజుకు సగటున 200 మృతదేహాలు వస్తున్నట్లు ఆ శ్మశానవాటికలో పనిచేసే ఓ సిబ్బంది చెప్పారని ఆ కథనం వెల్లడించింది. ఇక ఫార్మా దుకాణాల్లో మందుల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.

అధికారిక లెక్కల ప్రకారం.. చైనాలో ఇప్పటివరకు 5,327 మంది కొవిడ్‌తో మరణించారు. ఆ దేశంలో ఎవరైనా కేవలం కరోనా వల్ల చనిపోయినప్పుడే కొవిడ్‌ మరణంగా గుర్తిస్తారు. చాలామేర ఇతర దేశాల్లో మాత్రం కరోనా వైరస్‌ సోకి ఆ ప్రభావంతో ఇతర ఏ కారణాలతో మృతిచెందినా కొవిడ్‌ మరణాలుగానే లెక్కిస్తున్నారు. దీంతో ఆయా దేశాల్లో కొవిడ్‌ మరణాల సంఖ్య తీవ్రంగా ఉన్నప్పటికీ.. వాటితో పోలిస్తే చైనాలో గుర్తించిన కొవిడ్‌ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మరోవైపు, జీరో కొవిడ్‌ను సడలించిన తర్వాత లక్షణాలు లేని కొవిడ్‌ కేసులను బీజింగ్‌ ప్రకటించడంలేదు. అలాగే స్వల్ప లక్షణాలున్న వారిని కూడా నిర్బంధంగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించకుండా ఇళ్లలో ఉండాలని సూచిస్తున్నారు.