Representational Image (Photo Credits: Pixabay)

Beijing. AUG 31: ఓయువకుడు తన ప్రియురాలిని ముద్దు (Kissed) పెట్టుకుని ఆస్పత్రి పాలయ్యాడు. ప్రియురాలిని గాఢంగా ముద్దు పెట్టుకుని చెవులు పనిచేయక (Suffering Deaf) ఆస్పత్రిలో చేరాడు. ముద్దు ముద్దుగా ఉండాలి గానీ మొద్దుగా ఉంటే ఇటువంటి పరిస్థితే వస్తుందనేలా మారింది అతగాడి పరిస్థితి. ముద్దుమురిపాలు హద్దుల్లో ఉండాలి మరీ ఎక్కువైతే ఇదిగో ఇలాగే జరుగుతుందనేలా మారింది ఆ యువకుడి పరిస్థితి. ముద్దు పెట్టుకోవటానికి ప్రియురాలు ఒప్పుకుంది కదాని అదేపళంగా గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆనక చెవులు పనిచేయక చెవిటివాడిలా మారిపోయి ఆస్పత్రి పాలయ్యాడు. ఏంటీ ముద్దు పెట్టుకుంటే చెవుడు వస్తుందా…? అనే ఆందోళన కలిగేలా ఉందీ చైనాలో ఓ యువకుడి పరిస్థితి.

China Covid Deaths: చైనాలో కరోనా మారణహోమం, రెండు నెలల్లో 20 లక్షల మంది మృతి, జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేసిన తర్వాత భారీగా మరణాలు 

చైనా(China) లోని జెజియాంగ్ (Zhejiang)రాష్ట్రం వెస్ట్‌లేక్ ప్రాంతంలో డేటింగ్‌లో ఉన్న ఓ యువకుడు ఆగస్టు 22న తన ప్రియురాలిని ముద్దు పెట్టాడు. ఆగస్టు 22 అంటే చైనాలో వాలెంటైన్స్ డే. ఆరోజున ప్రేమికులు ముద్దు పెట్టుకోవటం కామన్. దీంట్లో భాగంగా ప్రియుడి ముద్దుకు ఆమె కూడా చక్కగా సహకరించింది. ఆమె కూడా ప్రియుడి ముద్దును ఆస్వాదించింది. కానీ ఈ ముద్దు మరీ హద్దు మీరింది. ఏకంగా 10 నిమిషాల పాటు ఇద్దరు ముద్దులో మునిగిపోయారు. గాఢమైన ఆ ముద్దు అతగాడిని చెవిటివాడిని చేసింది. ఏకంగా 10నిమిషాలపాటు విడవకుండా ముద్దుపెట్టుకోటంతో తర్వాత చెవులు పనిచేయక ఆస్పత్రి వెళ్లాడు. అతగాడిని పరీక్షించిన డాక్టర్లు అసలు విషయం తెలుసుకున్నారు. గాఢమైన ముద్దు వల్ల చెవిలోని గాలిలో ప్రెజర్ పెరిగిందని..అలాగే అతని ప్రియురాలి భారమైన శ్వాస కూడా ఒత్తిడికి కారణం కావటంతో అతని కర్ణభేరి పగిలిపోయిందని (Eardrum Damaged) తెలిపారు. ప్రస్తుతం అనికి అతనికి చికిత్స చేస్తున్నాం. కోలుకోవడానికి రెండు నెలలు పడుతుంతని తెలిపారు.

Viral Video: ఇదేమి దొంగతనం, షాపులో దూరి సెక్స్ బొమ్మను ఎత్తుకుపోయిన దొంగ, రాత్రి పని కోసమేనంటూ నెటిజన్లు కామెంట్ 

వీరద్దరు గాఢంగా ముద్దు పెట్టుకునే సమయంలో అతనికి ఏదో ఒక శబ్ధం వినిపించింది. ఆ తరువాత అతనికి ఏమీ వినిపించలేదు. అప్పటినుంచి అతనికి ఎడమ చెవి వినిపించటం మానేసింది.పైగా చెవిలో విపరీతమైన నొప్పి మొదలైంది. దీంతో అతను ఆందోళనగా ఆస్పత్రికి వెళ్లగా గాఢమైన ముద్దు వల్ల గాలి తీవ్రమైన ఒత్తిడి వల్ల కర్ణభేరి పగిలిందని డాక్టర్లు తెలిపారు.