Coronavirus Pandemic: మళ్లీ కరోనా పంజా, రానున్న ఫిబ్రవరి నాటికి ఐదు లక్షల మంది మృత్యువాత, యూరప్ దేశాలను వణికిస్తున్న ఏవై.4.2 వేరియంట్, హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఏవై.4.2 కొత్త వేరియంట్ వల్ల 2022, ఫిబ్రవరి నాటికి యూరప్‌లో కోవిడ్ వల్ల మరో ఐదు లక్షల మంది మృత్యువాత (Europe could see 500,000 more Covid deaths ) పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది.
Geneva, Nov 5: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ పుంజుకుంది. ఇప్పటికే వేవ్ లతో విరుచుకుపడని కోవిడ్ (Coronavirus Pandemic) రకరకాల వేరియంట్లతో ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా ఏవై.4.2 అనే కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది. డెల్టా కంటే ప్రమాదకరమైన ఈ కొత్త వేరియంట్ తో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూరోప్ ప్రాంతంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక హెచ్చరికలు జారీ చేసింది.
ఏవై.4.2 కొత్త వేరియంట్ వల్ల 2022, ఫిబ్రవరి నాటికి యూరప్‌లో కోవిడ్ వల్ల మరో ఐదు లక్షల మంది మృత్యువాత (Europe could see 500,000 more Covid deaths ) పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ప్రస్తుతం యూరప్ రీజియన్ పరిధిలో 53 దేశాల్లో కరోనా వ్యాపించి ఉందని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లుగే గురువారం మీడియాకు తెలిపారు. ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే, యూరప్ దేశాల్లో మరో ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
రష్యా, బ్రిటన్ తదితర దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవడంతో పలు యూరప్ దేశాలు అల్లాడిపోతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో యూరోపియన్ యూనియన్ రీజియన్ పరిధిలో సెంట్రల్ ఆసియా పరిధిలోని పలు దేశాలతోపాటు మరో 53 ఈయూ దేశాలు వస్తాయి. మహమ్మరి ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు.
డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లోని WHO యూరప్ ప్రధాన కార్యాలయం నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయ అధిపతి క్లూగే విలేకరులతో మాట్లాడుతూ, "మేము కరోనా మహమ్మారి యొక్క మరొక క్లిష్టమైన దశలో ఉన్నాము. యూరప్ తిరిగి కరోనా మహమ్మారి కేంద్రంగా ఉందని తెలిపాడు. అయితే ఇప్పుడు ఆరోగ్య అధికారులకు వైరస్ గురించి మరింత తెలుసు కాబట్టి దానిని ఎదుర్కోవడానికి మెరుగైన సాధనాలు ఉన్నాయని తెలిపారు.
ఈయూలోని 53 దేశాల్లో COVID-19 కారణంగా ఆసుపత్రిలో చేరే రేట్లు గత వారంలో రెండింతలు పెరిగాయని క్లూగే చెప్పారు. WHO ప్రకారం.. ఈ దేశాలు వారం వ్యవధిలోనే దాదాపు 1.8 మిలియన్ల కొత్త కేసులను నమోదు చేశాయి, ఇది మునుపటి వారంతో పోలిస్తే 6% పెరుగుదలగా ఉంది.ఈ వారంలో కరోనాతో 24,000 మంది మరణించారు. ఈ దేశాల్లో వ్యాక్సినేషన్ రోల్‌అవుట్ యొక్క వివిధ దశలలో ఉన్నాయని, ప్రాంత వ్యాప్తంగా సగటున 47% మంది ప్రజలు పూర్తిగా టీకాలు వేయబడ్డారని క్లూగే చెప్పారు. ఈయూలో కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే వారి జనాభాలో 70% మందికి పూర్తిగా టీకాలు వేయబడ్డాయి.