COVID in Japan: ఒలింపిక్స్ దెబ్బ..జపాన్‌లో కరోనా కల్లోలం, టోక్యోతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచన

ఒలింపిక్స్‌ పోటీలు జరుగుతున్న జపాన్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌ జరుగుతున్న టోక్యో రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి (Japan imposes state of emergency in Tokyo) విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

Yoshihide Suga (Photo Credits: Twitter)

Tokyo, July 31: ఒలింపిక్స్‌ పోటీలు జరుగుతున్న జపాన్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌ జరుగుతున్న టోక్యో రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి (Japan imposes state of emergency in Tokyo) విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పటిష్ట చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశ రాజధాని టోక్యోతో పాటు సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి సుగ (Prime Minister Yoshihide Suga) ప్రకటించారు. ఆగస్ట్‌ 31వ తేదీ వరకు ఎమర్జెన్సీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. హొక్కయిడో, ఇషికవ, క్యోటో, హ్యోగో, ఫకుఒక, ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది.

కరోనా థర్డ్ వేవ్..ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్, 132 దేశాలకు పాకిన ప్రమాదకర వైరస్, ఇప్పటి వరకు నాలుగు ఆందోళనకర వేరియంట్లు వెలుగులోకి, దేశాలకు హెచ్చరికలు జారీ చేసిన డబ్ల్యూహెచ్‌ఓ

అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రజలకు పలు సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది. ప్రయాణాలు విరమించుకోవాలని తెలిపింది. కరోనా నిబంధనలు పక్కాగా పాటించాలని హెచ్చరించింది. ఆగస్ట్‌ నెలాఖరు వరకు 40 శాతం ప్రజలకు రెండు డోసులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.

Here's PM's Office of Japan Tweet

ఆ దేశంలో గతవారంతో పోలిస్తే పది శాతం మేర కేసులు పెరిగాయి. ఏప్రిల్‌, జూన్‌ నెల మధ్యలో నెమ్మదించిన కరోనా జూలై తీవ్రమైంది. ముఖ్యంగా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం​ దేశ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్‌ క్రీడలు జరుగుతున్నాయి. దీంతో జపాన్‌లో పెరుగుతున్న కరోనాతో ఇతర దేశాలు కూడా భయాందోళన చెందుతున్నాయి. తమ క్రీడాకారుల ఆరోగ్యంపై దృష్టి సారించాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Trump Says Putin 'Destroying Russia': సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు, తొలి రోజే మిత్రుడికి షాకిచ్చిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్

Donald Trump 2.0: అమెరికాలో పుట్టిన విదేశీ పిల్లలకు యూఎస్ పౌరసత్వం రద్దు, లక్షలాది మంది భారతీయుల మెడపై వేలాడుతున్న బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ కత్తి, అసలైంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ?

Trump Withdraws US from WHO: డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకుంటున్నాం, అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళనున్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

Encounter In Chhattisgarh: తుపాకీ మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్‌ గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టులు మృతి

Share Now