Nepal Bars Entry Of Indians: నేపాల్‌లో కరోనా కల్లోలం, భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై నిషేధం, ఇండియా నుంచి వెళ్లిన నలుగురికి కరోనా పాజిటివ్

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో పొరుగుదేశం నేపాల్ భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై నిషేధం విధించింది.ఇండియా నుంచి వచ్చిన నలుగురు పర్యాటకులకు ఆ దేశంలో కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వారిని వెనక్కి పంపింది.

Coronavirus Outbreak | Representational Image (Photo Credits: PTI)

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో పొరుగుదేశం నేపాల్ భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై నిషేధం విధించింది.ఇండియా నుంచి వచ్చిన నలుగురు పర్యాటకులకు ఆ దేశంలో కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వారిని వెనక్కి పంపింది. ఝులాఘాట్ సరిహద్దు ప్రాంతం మీదుగా నేపాల్‌లోని బైతాడీ జిల్లాలోకి వీరు ప్రవేశించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. భారత్ నుంచి వచ్చిన నేపాలీలు కూడా కొవిడ్ బారినపడినట్టు పేర్కొన్నారు. షాకింగ్ వాస్తవాలు, కరోనా సోకిన వారిని వెంటాడుతున్న లాంగ్ కోవిడ్ లక్షణాలు, శ్వాసకోస సమస్యలు,నీరసం,రుచి,వాసన శక్తి తగ్గిపోవడం వంటివి కొనసాగుతున్నాయని అధ్యయనంలో వెల్లడి

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత పర్యాటకులపై నిషేధం విధించినట్టు తెలిపారు. మరోవైపు నేపాల్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న 1,090 కేసులో నమోదయ్యాయి. టిబెట్‌లో కేసులు పెరుగుతుండడంతో టిబెట్ బౌద్ధ నేతల సంప్రదాయ గృహమైన పోటాలా సౌధాన్ని చైనా నిన్నటి నుంచి మూసివేసింది. చైనాలో నిన్న 828 కొత్త కేసులు బయటపడగా అందులో టిబెట్‌లో వెలుగు చూసినవే 22 ఉన్నాయి.