Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్‌ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

అయితే, ఈ కరోనా వైరస్ మన శరీరానికి ఒక విధంగా మంచే చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు.

Ling Cancer (Credits: X)

Newdelhi, Nov 24: నాలుగేండ్ల కిందట యావత్తు భూప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా (Corona) ఎన్నో లక్షల మందిని పొట్టనబెట్టుకున్నది. అయితే, ఈ కరోనా వైరస్ మన శరీరానికి ఒక విధంగా మంచే చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు. కొవిడ్ సోకడం వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలే కాదు.. మొదటిసారిగా కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ తో ఒక ప్రయోజనం ఉందని వాళ్లు చెప్తున్నారు. తీవ్రమైన కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకడం.. క్యాన్సర్‌ తీవ్రతను (Cancer) తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఇంగ్లండ్ పరిశోధకులు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో గుర్తించారు. ఈ పరిశోధన ప్రకారం.. శరీరంలో మైనోసైట్లు అనే రకమైన తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్లు, వైరస్‌ ల నుంచి శరీరానికి రక్షణ కల్పించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అయితే, క్యాన్సర్‌ బాధితుల్లో మాత్రం కొన్నిసార్లు క్యాన్సర్‌ కణాలు ఈ మోనోసైట్లను హైజాక్‌ చేసి క్యాన్సర్‌ అనుకూల కణాలుగా మార్చేస్తాయి. దీంతో ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థ నుంచి క్యాన్సర్‌కు రక్షణ కల్పించేలా మారిపోతాయి.

కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

అలా కొత్త మోనోసైట్ల ఉత్పత్తి

తీవ్రమైన కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు శరీరంలో ప్రత్యేక రకమైన మోనోసైట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి క్యాన్సర్‌ వ్యతిరేక గుణాలను తిరిగి పొందుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో క్యాన్సర్ పై పోరాడే శక్తి రోగ నిరోధక వ్యవస్థకు చేకూరుతుందని, అలా కరోనా ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నట్టు పేర్కొన్నారు.

చర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖత్, కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు..పట్నం నరేందర్ రెడ్డి భార్య