Schools to Reopen in Wuhan: కరోనా నుంచి కోలుకున్న వుహాన్, సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు,కాలేజీలు ప్రారంభం, విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు
అక్కడ స్థానిక ప్రభుత్వం ఆంక్షలకు సెలవిస్తూ పూర్తిస్థాయి అన్‌లాక్ దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలోనే స్కూళ్లు తెరిచేందుకు అనుమతిస్తూ (Schools to Reopen in Wuhan) అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెప్టెంబర్ 1 నుంచి అక్కడున్న 2842 విద్యా సంస్థలు తమ కార్యకలాపాలు యథాతథంగా ప్రారంభించనున్నాయి. 10.4లక్షల మంది విద్యార్థులు ఆగిపోయిన తమ చదువులను తిరిగి ప్రారంభించనున్నారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Wuhan, August 29: కరోనావైరస్ తొలిసారి వెలుగు చూసిన చైనాలోని వూహాన్ నగరం (China's Wuhan) ఇప్పుడు సాధారణ జీవితానికి వచ్చేసింది. అక్కడ స్థానిక ప్రభుత్వం ఆంక్షలకు సెలవిస్తూ పూర్తిస్థాయి అన్‌లాక్ దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలోనే స్కూళ్లు తెరిచేందుకు అనుమతిస్తూ (Schools to Reopen in Wuhan) అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెప్టెంబర్ 1 నుంచి అక్కడున్న 2842 విద్యా సంస్థలు తమ కార్యకలాపాలు యథాతథంగా ప్రారంభించనున్నాయి. 10.4లక్షల మంది విద్యార్థులు ఆగిపోయిన తమ చదువులను తిరిగి ప్రారంభించనున్నారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
అంతే కాకుండా.. వీలైనంత వరకూ ప్రజారవాణా వ్యవస్థకు దూరంగా ఉండాలని కూడా సూచించింది. అయితే అనుకోని అవాంతరాలేమైనా ఎదురైతే ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం అత్యవసర ప్రణాళికను సిద్ధం కూడా చేసింది. అవసరాన్ని బట్టి ఆన్‌లైన్ చదువువైపు మళ్లేలా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. కాగా..వుహాన్‌లో ఏప్రిల్ నెలలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవడం ప్రారంభించింది. మే 18 నుంచీ అక్కడ ఒక్క లోకల్ ట్రాన్సిమిషన్ కేసు (COVID-19 pandemic) కూడా నమోదు కాలేదు. గాల్వన్ వ్యాలీ ఘర్షణ, బయటపడిన చైనా సైనికుని సమాధి
school is back in wuhan
అయితే తమ పాఠశాల నుండి నోటీసు అందుకోని విదేశీ విద్యార్థులు, ఉపాధ్యాయులను తిరిగి అనుమతించరు.COVID-19 మహమ్మారి ఉద్భవించిందని నమ్ముతున్న చైనా వుహాన్ నగరం జనవరి చివరి నుండి రెండు నెలలకు పైగా లాక్ చేయబడింది. 3,869 మంది కరోనాతో అక్కడ మరణించారు. లాక్డౌన్ ఎత్తివేయబడిన ఏప్రిల్ నుండి వుహాన్ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. మే 18 నుండి ఒక్క కరోనావైరస్ కూడా అక్కడ నమోదు కాలేదని చైనా ఆరోగ్యశాఖ తెలిపింది.