New Delhi, August 29: ఇండియా-చైనా దళలా మధ్య జూన్ 15న గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో (Galwan Clash) 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.అయితే గాల్వన్ వ్యాలీలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో (India-China Tensions) చైనాకు ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికీ చైనా గోప్యంగానే ఉంచింది. ఈ ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు (People's Liberation Army (PLA) ప్రాణాలు కోల్పోయారు? ఎంత మంది గాయపడ్డారు? అనే వివరాలను చైనా కమ్యూనిష్టు ప్రభుత్వం (ChinA Govt) ఇప్పటికీ దేశ ప్రజలకు తెలియజేయలేదు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 40 మంది వరకు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కానీ చైనా నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ క్రమంలో తాజాగా ఓ సమాధి రాయి ఫోటో ( Tombstone of 'PLA Soldier) ఇంటర్నెట్‌లో వైరలవుతుంది. చైనా సైనికులు మరణించారనే దానికి ఇదే నిదర్శనం అంటూ నెటిజనులు దాన్ని వైరల్ చేస్తున్నారు. కాగా చైనీస్ ఇంటర్నెట్ వీబో అకౌంట్‌లో సైనికుడి సమాధి రాయికి సంబంధించిన ఫోటో ప్రత్యక్షమయ్యింది. క్షణాల వ్యవధిలోనే ఆ ఫోటో మన దేశంలోని చాలా ట్విట్టర్ యూజర్ల అకౌంట్లలో ప్రత్యక్షమయ్యింది. ఈ సమాధి రాయి చైనా సైనికుడు చెన్ జియాంగ్‌రాంగ్‌కు చెందినదిగా తెలుస్తోంది. సమాధి రాయిపై మాండరిన్ భాషలో 69316 దళాల సైనికుడు, పింగ్నాన్, ఫుజియాన్ నుంచిగ అని రాసి ఉంది. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఆ సైనికుడు చేసిన త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందంటూ ఆ సమాధి శిలాఫలకంపై రాసి ఉంది. 20 మంది భారత జవాన్లు మృతి వెనుక చైనా చిమ్మిన విషం ఏమిటీ?
‘ఇది చెన్ చియాంగ్రో సమాధి. భారత్‌తో గాల్వాన్‌లో జరిగిన ఘర్షణలో ఆయన ప్రాణ త్యాగం చేశారు. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ చెన్ త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది’ అని సమాధి వద్ద ఉన్న శిలాఫలకంపై రాసుంది. జూన్ 2020లో భారత సరిహద్దు దళాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన ప్రాణ త్యాగం చేశారు. మరణానంతరం కేంద్ర సైనిక కమిషన్ జ్ఞాపకం చేసుకుందని తెలుపుతోంది. 2020 ఆగస్టు 5న దక్షిణ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్‌లో ఈ సమాధిని నిర్మించినట్లు ఫోటో చూపిస్తోంది. మరణించిన సైనికుడు 19 సంవత్సరాల వయస్సు వాడని.. అతడు 2001 డిసెంబర్‌లో జన్మించినట్లు సమాధి మీద రాసి ఉంది. అయితే దీనిపై ఇంకా చైనా అధికార యంత్రాంగం స్పందించలేదు. . సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత, 20 మంది భారత జవాన్లు, 40 మంది చైనా సైనికులు మరణం, ప్రధానితో రక్షణమంత్రి అత్యవసర భేటీ
కాగా అమరులైన భారత్ జవాన్లకు సకల ప్రభుత్వ లాంఛనాల మధ్య దేశ ప్రజలు తుది వీడ్కోలు పలకగా.. చైనా సైనికుల అంత్యక్రియలు మాత్రం అక్కడి ప్రభుత్వం అత్యంత గోప్యంగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై అక్కడి ప్రజల్లో ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తమవుతోందని సమాచారం. కనీసం కుటుంబసభ్యులు, బంధువులకు కూడా తుది వీడ్కోలు పలికే అవకాశం లభించలేదని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. పూర్తి వివరాలు తమకు చెప్పాలంటూ చైనా సోషల్ మీడియాలో ప్రజలు గొంతెత్తినప్పటికీ ప్రభుత్వం ఈ గళాలను పట్టించుకోలేదు. ఇప్పటికీ జరిగిన నష్టం తాలూకు వివరాలు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తాజా చిత్రాలు అక్కడి రాజకీయ వాతావరణాన్ని మరోసారి వేడెక్కించాయి. సరిహద్దుల్లో తెలుగు బిడ్డ వీర మరణం, కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చైనా సరిహద్దు ఘర్షణల్లో మృతి, దేశం కోసం అమరుడయ్యాడన్న కల్నల్ తల్లి
తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు దేశాల సైనిక కమాండర్ల మధ్య పలు దఫాల చర్చలు జరిగాయి. అయినా డ్రాగన్ దేశం సరిహద్దులో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తోంది.