IPL Auction 2025 Live

Donald Trump Health Update: పుకార్లు నమ్మకండి.. నాఆరోగ్యం బాగానే ఉంది, వీడియోని విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు, డిశ్చార్జ్‌ అయిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెడతానని తెలిపిన డొనాల్డ్ ట్రంప్

ఈ వీడియోలో సంపూర్ణ ఆరోగ్యంతో అతి త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ఆస్పత్రిలో చేరే సమయంలో అనారోగ్యంతో కాస్త ఇబ్బంది పడ్డా. ప్రస్తుతం బాగానే ఉన్నానని ట్రంప్‌ పేర్కొన్నారు. రానున్న రెండు మూడు రోజులు నాకు అత్యంత కీలకం అని ఆయన అన్నారు.

Donald Trump (Photo Credits: US President Trump's Twitter)

Washington, October 4: కరోనావైరస్ బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఆరోగ్యం (Donald Trump Health Update) విషమిస్తోందన్న వార్తల నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ఓ వీడియో ను ప్రజల ముందు ఉంచారు. ఈ వీడియోలో సంపూర్ణ ఆరోగ్యంతో అతి త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ఆస్పత్రిలో చేరే సమయంలో అనారోగ్యంతో కాస్త ఇబ్బంది పడ్డా. ప్రస్తుతం బాగానే ఉన్నానని ట్రంప్‌ పేర్కొన్నారు. రానున్న రెండు మూడు రోజులు నాకు అత్యంత కీలకం అని ఆయన అన్నారు.

అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని (2020 US Presidential Elections) మధ్యలోనే విడిచిపెట్టాల్సి వచ్చిందని.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే ప్రచారాన్ని ఉధృతం చేస్తానని డొనాల్డ్ ట్రంప్‌ చెప్పారు. వాషింగ్టన్‌లోని వాల్టర్‌ రీడ్‌ మిలటరీ ఆస్పత్రిలో ట్రంప్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన ‘వర్క్‌ ఫ్రమ్‌ హాస్పిటల్‌’ చేసేందుకు వీలుగా వైట్‌ హౌస్‌లోని స్పెషల్‌ సూట్‌ రూమ్‌ను ‘అధ్యక్ష కార్యాలయం’గా మార్చేశారు. అధికార నివాసం వైట్‌ హౌస్‌లోని అధికారులతో ట్రంప్‌ ఇక్కడి నుంచే నేరుగా మంతనాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

Here's Video

అయితే ఆస్పత్రిలోనే ఈ వీడియో రికార్డు చేసినట్టు తెలుస్తున్నప్పటికీ ఎప్పుడు షూట్‌ చేశారనే విషయమై క్లారిటీ లేదు. ఆస్పత్రిలో చేరిన వెంటనే రికార్డు చేశారా లేక లేటెస్ట్‌ వీడియోనా అనే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ట్రంప్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని, రెండు రోజులు గడిస్తేగాని పూర్తి వివరాలు చెప్పలేమంటూ అధికార ప్రకటన వెలువడినట్టు వార్తలొచ్చాయి. శుక్రవారం కరోనా బారినపడిన ట్రంప్‌ దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

గుడ్ న్యూస్, రూ.50కే ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌‌ను అందిస్తామని తెలిపిన ఢిల్లీ సిఖ్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ, దేశంలో తాజాగా 75,829 మందికి కరోనా, కోవిడ్ మరణాలపై బయటకొచ్చిన ఆసక్తికర విషయాలు

కాగా బిడెన్‌లా నేను మాస్క్‌ ధరించను. ఆయనను ఎప్పుడైనా చూడండి.. మాస్క్‌ వేసుకునే కనిపిస్తారు’ అంటూ డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ను ఎగతాళి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (74) స్వయంగా కరోనా బారినపడిన సంగతి విదితమే. ట్రంప్‌తోపాటు ఆయన భార్య మెలానియా ట్రంప్‌కు (Melania Trump) కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అధ్యక్షుడి ముఖ్య సలహాదారుల్లో ఒకరైన హోప్‌ హిక్స్‌కు కరోనా సోకటంతో ఆమె నుంచి ట్రంప్‌ దంపతులకు వైరస్‌ వ్యాపించినట్టుగా తెలుస్తోంది.