US Elections 2020: వివాదాల మధ్య జూనియర్ ట్రంప్ ట్వీటు, మ్యాప్‌లో జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌ ఇండియా నుంచి అవుట్, మండి పడుతున్న విపక్షాలు, ట్వీటుపై స్పందించిన పలువురు ప్రముఖులు

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్‌ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. జూనియర్ ట్రంప్ ట్వీటుపై (Donald Trump Jr Tweet) మన దేశంలోని విపక్షాలు మండి పడుతున్నాయి. ట్రంప్‌ తన బుద్ది చూపించుకున్నారు. మనం స్నేహ హస్తం అందిస్తే.. వారు మనల్ని అవమానించారు అంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Donald Trump Jr tweets world map shaded in red to claim Donald Trump's victory (Photo Credits: Twitter)

New Delhi, November 4: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మరి కొద్ది సేపట్లో (US Elections 2020) వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్‌ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. జూనియర్ ట్రంప్ ట్వీటుపై (Donald Trump Jr Tweet) మన దేశంలోని విపక్షాలు మండి పడుతున్నాయి. ట్రంప్‌ తన బుద్ది చూపించుకున్నారు. మనం స్నేహ హస్తం అందిస్తే.. వారు మనల్ని అవమానించారు అంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ట్వీటు వివరాల్లోకెళితే.. డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ ఓ వరల్డ్‌ మ్యాప్‌ని (Donald Trump Jr Shares World Map) ట్వీట్‌ చేశారు. దీనిలో దాదాపు అన్ని దేశాలను రిపబ్లికన్‌ పార్టీ కలర్‌ అయిన ఎరుపు రంగులో చూపించారు. ఈ దేశాలన్ని తన తండ్రి విజయం సాధిస్తాడని నమమ్ముతున్నాయి.. ఆయనకే ఓటు వేస్తాయి అనే ఉద్దేశంతో ఇలా ఎరుపు రంగులో చూపించారు. అయితే ఇండియా, చైనా, లైబేరియా, మెక్సికో వంటి దేశాలను మాత్రం డెమొక్రాట్‌ పార్టీ రంగు బ్లూ కలర్‌లో చూపించారు. ఈ దేశాలన్ని జో బైడెన్‌కు మద్దతుదారులని.. ఆయనకే ఓటు వేస్తాయని తెలిపారు.

Donald Trump Jr Tweet

అలానే అమెరికాలోని కాలిఫోర్నియా, మేరీల్యాండ్‌ వంటి రాష్ట్రాలను కూడా నీలం వర్ణంలోనే చూపించారు. ఒకే చివరకు నా ఎన్నికల మ్యాప్‌ అంచనా ఇలా ఉంది అంటూ చేసిన ఈ ట్వీట్‌ ఇండియాలో వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ ట్వీట్‌లో అతడు జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను ఎరుపు రంగులో చూపించాడు. అది కాస్తా వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్షాలు మండి పడితున్నాయి.

ట్రంప్‌కి షాక్ ఇస్తున్న అమెరికా ఎన్నికల ఫలితాలు, ఎన్నిక‌ల కౌంటింగ్‌లో ఫ్రాడ్ జరుగుతుందని తెలిపిన అమెరికా అధ్యక్షుడు, సుప్రీంకు వెళతామని ప్రకటన

ఈ క్రమంలో జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ట్వీట్‌పై స్పందించారు. ‘సీనియర్‌ ట్రంప్‌తో మనకు ఎంతో స్నేహం. ఇక జూనియర్‌ ట్రంప్‌ ఇండియాని జో బైడెన్‌, కమలా హారిస్‌ మద్దుతుదారుగా చూపించారు. ఆశ్చర్యం ఏంటంటే.. జమ్ము కశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాలు మాత్రమే ట్రంప్‌కి ఓటు వేస్తాయని వెల్లడించారు. ఎవరైనా అతడి కలర్‌ పెన్సిల్‌ని లాక్కొండి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

Omar Abdullah Reply Tweet

Shashi Tharoor Reply Tweet

ఇక కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయుకుడు శశి థరూర్‌ కూడా జూనియర్‌ ట్వీట్‌పై స్పందించారు. ‘నమో బ్రొమాన్స్‌కు దక్కిన బహుమతి ఇది. డాన్‌ జూనియర్‌ భారత్‌లోని జమ్ము కశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాలను చైనా, మెక్సికో వంటి శత్రువులు, మురికి ప్రదేశాలతో కలిపారు. సెరినేడింగ్‌ ఈవెంట్ల కోసం కోట్లు ఖర్చు చేసినందుకు దక్కిన ఫలితం ఇది’ అన్నారు.

Abdul Basit  Tweet

భారతదేశానికి మాజీ పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ మ్యాప్‌ని "ప్రోత్సాహకరంగా"ఉంది అంటూ ప్రశంసించారు. "మంచిది. జమ్మూ కాశ్మీర్‌ని పాకిస్తాన్‌లో భాగంగా చూపించారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంది" అంటూ ట్వీట్‌ చేశారు.



సంబంధిత వార్తలు