COVID-19 Effect on US Economy: అమెరికాలో కరోనా మృత్యుఘోష, తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభం, ఆంక్షల్ని ఎత్తి వేసే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఇప్పుడు అక్కడ మరణాలు 19 వేలు దాటినట్లుగా తెలుస్తోంది. తాజాగా కరోనా (Coronavirus) రక్కసి కోరల్లో చిక్కుకున్న అగ్రరాజ్యం అమెరికా మృతుల్లో మొదటి స్థానానికి చేరుకుంది. రోజూ రెండు వేలకు పైగా మరణాలు నమోదవుతున్న వేళ కోవిడ్ మృతుల్లో ఇటలీతో (Italy) పోటీపడుతూ వస్తున్న యూఎస్ (US) శనివారం రాత్రి అందిన లెక్కల మేరకు 20 వేల 506 మృతులతో ఇటలీని దాటేసింది.
Washington DC, April 12: అమెరికాలో కోవిడ్–19 (COVID-19 in America) విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పుడు అక్కడ మరణాలు 19 వేలు దాటినట్లుగా తెలుస్తోంది. తాజాగా కరోనా (Coronavirus) రక్కసి కోరల్లో చిక్కుకున్న అగ్రరాజ్యం అమెరికా మృతుల్లో మొదటి స్థానానికి చేరుకుంది. రోజూ రెండు వేలకు పైగా మరణాలు నమోదవుతున్న వేళ కోవిడ్ మృతుల్లో ఇటలీతో (Italy) పోటీపడుతూ వస్తున్న యూఎస్ (US) శనివారం రాత్రి అందిన లెక్కల మేరకు 20 వేల 506 మృతులతో ఇటలీని దాటేసింది.
ప్రపంచాన ఆగని కరోనా మృత్యుఘోష, లక్షమందికి పైగా మృతి
వైరస్ బారినపడ్డ లెక్కల్లోనూ అమెరికా 5,27,111 కేసులతో తొలిస్థానంలో ఉంది. ఇక యూరప్ దేశాల్లో కోవిడ్ దెబ్బకు ఎక్కువగా బలి అవుతున్న ఇటలీ 19,468 మరణాలతో రెండో స్థానంలో ఉంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఇప్పుడు అమెరికాను ఆర్థిక సంక్షోభం (COVID-19 Effect on US Economy) వెంటాడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. దీనిని గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు ట్రంప్ పెద్ద సాహస నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కరోనాతో ప్రపంచానికి ఉగ్రవాద ముప్పు
వైట్ హౌస్‌లో శుక్రవారం ట్రంప్ (Donald Trump) విలేకరులతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడానికి ఆంక్షల్ని ఎత్తి వేయడం పెను సవాల్‌గా మారిందని అన్నారు. ఆ నిర్ణయమే తన జీవితంలో అతి పెద్దదన్న ట్రంప్ దానిని ఎప్పుడు తీసుకుంటారో వెల్లడించలేదు. కాగా కోవిడ్ –19 దెబ్బతో అగ్రరాజ్యం సంక్షోభంలో పడిపోయింది. దేశంలోని 33 కోట్ల మందిలో 95 శాతానికి పైగా ఇళ్లకే పరిమితమయ్యారు. కొద్ది వారాల్లోనే 1.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
కరోనా కాటుకు బలైన స్పెయిన్ రాణి
ఈ నేపథ్యంలో ప్రజల్ని ఇల్లు కదలవద్దన్న ఆంక్షల్ని ఎత్తి వేయడమే తాను జీవితంలో తీసుకోబోయే అతి పెద్ద నిర్ణయమని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టాలంటే ప్రజలందరూ మళ్లీ పనుల్లోకి రావాలని, దానికి తగిన సమయం కోసం చూస్తున్నామని అన్నారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి ఆ దేవుడిపైనే భారం వేశారు. అయితే కచ్చితంగా ఆ నిర్ణయం నేను నా జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం అవుతుంది’అని ట్రంప్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
న్యూయార్క్‌లో కుప్పలు కుప్పలుగా కరోనా శవాలు
ఇక చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన మహమ్మారి కరోనా ఆ దేశంలో తగ్గముఖం పట్టిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో అక్కడ విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తున్నారు. కాగా కరోనా వైరస్ భయం మళ్లీ చైనాలో మొదలైంది. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వందలాది మంది చైనీయులు తిరిగి స్వస్థలాలకు చేరుకోవడంతో వారి ద్వారా రెండోసారి వైరస్ విజృంభిస్తుందనే ఆందోళనలో ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సోకిన కేసులు 1,183కి చేరుకోవడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.
అయితే, యూరప్, యూఎస్‌లో మాత్రం కోవిడ్ విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. అమెరికాలో న్యూయార్క్ నగరాన్ని కరోనా అతలాకుతలం చేస్తోంది. న్యూయార్క్‌లో వెయ్యి మందికిపైగా, న్యూజెర్సీలో 400 మందికి పైగా ఇండియన్ అమెరికన్లకు వైరస్ సోకింది. కోవిడ్ బాధితులకు సాయం చేయడానికి ఇప్పటికే పలు ప్రవాస భారతీయ సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక యంత్రాంగంతో కలిసి తమ వంతు సాయం అందిస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీలోని మినీ ఇండియాగా పిలిచే ఓక్ ట్రీ రోడ్డులో మృతుల సంఖ్య అత్యధికంగా ఉంది.