Earthquake in China: చైనాపై ప్రకృతి ప్రకోపం, పెను విధ్వంసం సృష్టించిన భారీ భూకంపం, 65 మంది మృతి, భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదు

ఈ భూకంపంతో 65 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు.భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది.

Earthquake in China: చైనాపై ప్రకృతి ప్రకోపం, పెను విధ్వంసం సృష్టించిన భారీ భూకంపం, 65 మంది మృతి, భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదు
Earthquake of Magnitude

Chinam, Sep 6: చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌ లుడింగ్‌ కౌంటీలో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ఈ భూకంపంతో 65 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు.భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది. నీరు, విద్యుత్‌ సరఫరా, రవాణ, టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కరువు పరిస్థితులు, కోవిడ్‌ ఆంక్షలతో ఈ ప్రావిన్స్‌ జనం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. చైనాలో భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.చాలాచోట్ల భవనాలు భవనాలు కూలిపోగా.. పలుచోట్ల చిక్కుకున్న 50వేలమందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిచువాన్‌లో 6500 రెస్క్యూ టీమ్‌లను, నాలుగు హెలికాప్టర్లను మోహరించారు.

రష్యా ఎంబసీ సమీపంలో భారీ బాంబు పేలుడు, ఇద్దరు ఉద్యోగులతో సహా 25 మంది మృతి, కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో ఘటన

దీంతో పాటు 1,100 అగ్నిమాపక దళ బృందాలను రంగంలోకి దింపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ 50 మిలియన్ యువాన్లను రెస్క్యూ, రిలీఫ్ ఫండ్‌ను విడుదల చేసింది. ప్రాంతీయ ప్రభుత్వం కూడా గంజికి 50 మిలియన్ యువాన్లను కేటాయించింది.2008లో చైనాలో 8.2 తీవ్రతతో భూకంపం సంభవించగా.. 69వేలమందికిపైగా మృత్యువాతపడ్డారు. 18వేల మందికిపైగా మరణించారు.



సంబంధిత వార్తలు

Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు