తాలిబన్ పాలిత ఆప్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మందికిపైగా మృతిచెందినట్టు ఆ దేశ మీడియాలో ఓ ప్రకటనలో పేర్కొంది.వివరాల ప్రకారం.. కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో సోమవారం బాంబ్ బ్లాస్ట్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి కారణంగా బ్లాస్ట్ జరిగింది. సదరు వ్యక్తి రష్యా రాయబార కార్యాలయంలోని ప్రవేశించి లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందే ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తిని తాలిబాన్ గార్డులు గుర్తించి కాల్చిచంపినట్టు పోలీసు అధికారి మవ్లావి సాబిర్ తెలిపారు. కాగా, ఈ పేలుడు ఘటనలో దాదాపు 25 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు రష్యా దౌత్యవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.
At least 25 people were killed and injured in an explosion near the #Russian embassy in #Kabul.
Russian Foreign Ministry says 2 employees of the Russian Embassy in Kabul were killed today's bomb blast on Darulaman road in Kubal.#Afghanistan#KubalBlast pic.twitter.com/EYlWEGaNGi
— Kamran Khan Afridi (@Kamrankhan1432) September 5, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)