Earthquake in Philippines: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ, రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.6 గా నమోదు, ఒక్కసారిగా అతలాకుతలమైన దేశం (వీడియో ఇదుగోండి)
రిక్టర్ స్కేల్‌పై తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.37 గంటలకు ప్రకంపనలు (Earthquake) వచ్చాయి. భూకంప కేంద్రాన్ని భూమికి 63 కిలోమీటర్ల లోతులో గురించినట్లు పేర్కొంది.
Manila, December 2: ఫిలిప్పీన్స్‌లోని మిండనావోలో (Mindanao) శనివారం భారీ భూకంపం (Earthquake in Philippines) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.37 గంటలకు ప్రకంపనలు (Earthquake) వచ్చాయి. భూకంప కేంద్రాన్ని భూమికి 63 కిలోమీటర్ల లోతులో గురించినట్లు పేర్కొంది. భారీ భూ ప్రకంపనల నేపథ్యంలో అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం.. సునామీ హెచ్చరికలను జారీ (Tsunami Warning) చేసింది. ఫిలిప్పీన్స్‌తో పాటు జపాన్‌ను సునామీ తాకే అవకాశం ఉందని పేర్కొంది. సునామీ స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి వరకు ఫిలిప్పీన్స్‌ను తాకొచ్చని ఫిలిప్పీన్స్ సిస్మోలజీ ఏజెన్సీ పేర్కొంది.
అయితే, జపనీస్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే సముద్ర తీరంలో మీటర్ వరకు అలలు ఎగిసే అవకాశం ఉందని, సునామీ జపాన్ పశ్చిమ తీరాన్ని ఆదివారం మధ్యాహ్నం వరకు తాకే అవకాశం ఉందని తెలిపింది.
ఇదిలా ఉండగా.. గత నెలలోనూ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనల ధాటికి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. 13 మంది గాయాలకు గురయ్యారు. ఫసిపిక్ ఓసియన్‌లోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఫిలిప్పీన్స్, జపాన్, ఇండోనేషియా దేశాలున్నాయి. ఆయా దేశాల్లో భూకంపాలు సాధారణంగా సంభవిస్తుంటాయి.