దేశ జనాభాను పెంచేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) కీలక ప్రకటన చేశారు. దేశంలోని మహిళలు (Russian Women) ఎనిమిది అంతే కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేశారు. రష్యా జనాభాను పెంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. మహిళలు ఎనిమిది మంది అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కనాలని, పెద్ద కుటుంబాలను ఏర్పరచాలని కోరారు. మంగళవారం మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్‌లో ప్రసంగించారు.

రష్యాలో గత కొన్ని ఏళ్లుగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. రష్యా జననాల రేటు 1990ల నుండి గణనీయంగా పడిపోతోంది. మరోవైపు ఉక్రెయిన్‌ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 3,00,000 వరకు ఉండవచ్చని నిపుణుల అంచానా. రష్యా విధానాలు నచ్చక 8,20,000-9,20,000 మంది ప్రజలు రష్యాను వీడి పారిపోయారని సమాచారం.

Here's NDTV Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)