Earthquake in Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం, ఊగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, జపాన్ సహా ఇతర దేశాలకు సునామి హెచ్చరికలు
దక్షిణ తైవాన్‌లోని హులియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూఅంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభావించాయని వెల్లడించింది. ఆ తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్‌జీఎస్ వెల్లడించింది.
Taiwan, April 6: తైవాన్ (Taiwan) ద్వీపాన్ని భారీ భూకంపం (Earthquake) వణికించింది. దక్షిణ తైవాన్‌లోని హులియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూఅంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభావించాయని వెల్లడించింది. ఆ తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్‌జీఎస్ వెల్లడించింది.
రిక్టర్ స్కేల్‌పై 7.6 గా నమోదైన ఈ భూకంపంలో ఓ వ్యక్తి మృతి చెందగా వందలాదిమందికి గాయాలు అయ్యాయి. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా బుదవారం ఉదయం 7:58 గంటలకు ద్వీపం తూర్పు తీరాన్ని తాకింది. ఫలితంగా అనే భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. భూకంపం ధాటికి ఏకంగా ఫ్లైఓవర్, వంతెనలే ఊగిపోయాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అక్కడి ప్రజలు యోగ క్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. తైవాన్ లో భారీ భూకంపం, జపాన్ కు సునామీ హెచ్చరికలు జారీ, రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4 గా నమోదు
విపత్తు సంభవించిన సమయంలో తైపీ నగరంలోని ఓ తీగల వంతెన కొన్ని నిమిషాల పాటు కదిలింది. దానిపై ఉన్న వాహనదారులు భయంతో ఎక్కడికక్కడే ఆగిపోయారు. మరో చోట మెట్రో బ్రిడ్జి ఫ్లైఓవర్ ఊగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తైవాన్ వ్యాప్తంగా భూకంప ప్రభావం కన్పించింది.
Here's Videos
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ విపత్తు సంభవించింది. అటు జపాన్ దక్షిణ ప్రాంతంలోని పలు దీవుల్లోనూ ప్రకంపనలు కన్పించాయి. భూకంపం కారణంగా తొలుత భారీ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి ఈ ముప్పు తీవ్రత తగ్గినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో భూకంపానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. భూకంపం తీవ్రత దృశ్యాలు అనేక చోట రికార్డైనాయి. పలు ఆకాశహర్మ్యాలు, అనేక ఇళ్లు కూలి పోయాయి. చాలా చోట్ల రవాణా మార్గాలు దెబ్బ తిన్నాయి. మెట్రో రైలు, స్విమ్మింగ్ పూల్, దృశ్యాలు ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాన హౌలెన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది.
దీంతో తూర్పు తైవాన్‌తో పాటు దక్షిణ జపాన్, ఫిలిప్పీన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీచేశారు. తైవాన్, జపాన్, ఫిలిప్సీన్స్ సహా పలు దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తాయి. కానీ ఈ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. సెప్టెంబరు 1999లో సంభవించిన భూకంపానికి 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
1999 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని స్థానిక అధికారులు వెల్లడించారు. అప్పుడు నాంటౌ కౌంటీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం ధాటికి సుమారుగా 2,500 మందికి పైగా మరణించారు. 1,300 మందికి పైగా గాయపడ్డారు. ఆ తర్వాత 25 ఏండ్లలో తైవాన్‌ను తాకిన బలమైన భూకంపం ఇదే అని అధికారులు తెలిపారు.
తైవాన్‌లో భూకంపంతో జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్‌లోని దీవులకు సుమారు 3 మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడి సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేసింది. దాదాపు 30 నిమిషాల తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే దక్షిణ దీవులైన మియాకో, యాయామా దీవుల తీరాలను తాకినట్లు జపాన్ పేర్కొంది.
సునామీ వస్తున్నదని, అందరూ ఇండ్లు ఖాళీ చేయాలని జపనీస్ జాతీయ వార్తాసంస్థ ఎన్‌హెచ్‌కే ప్రసారం చేస్తున్నది. కాగా, తైవాన్‌లో భూకంపాలు తరచూ వస్తుంటాయి. 1996లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది ప్రజలు మరణించారు. ఇక జపాన్‌లో ప్రతిఏటా సుమారు 1500 భూకంపాలు వస్తుంటాయి.