Earthquake in Turkey: టర్కీ, సిరియా భూకంపంలో 1300కు పెరిగిన మృతుల సంఖ్య, కుప్పకూలిపోతున్న భవనాల వీడియోలు వైరల్, చరిత్రలో అతి పెద్ద భూకంపం ఇదేనంటున్న నిపుణులు

ఆగ్నేయ టర్కీ, ఉత్తర సిరియాలో ఈరోజు సంభవించిన 7.8 తీవ్రతతో (powerful 7.8 magnitude) సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1300 కు (Death toll rises to 1300) పెరిగింది.

Eartnquake Representative Image. (Photo: Reuters)

ఇస్తాంబుల్‌, ఫిబ్రవరి 6: ఆగ్నేయ టర్కీ, ఉత్తర సిరియాలో ఈరోజు సంభవించిన 7.8 తీవ్రతతో (powerful 7.8 magnitude) సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1300 కు (Death toll rises to 1300) పెరిగింది. వందలాది మంది ఇంకా చిక్కుకుపోయారని, టోల్ పెరగవచ్చని AP నివేదికలు తెలిపాయి. ఈ భూకంపం (Earthquake in Turkey) వ‌ల్ల వేలాది సంఖ్య‌లో భ‌వ‌నాలు నేల‌మ‌ట్టం అయ్యాయి.

గ‌జియాన్‌టెప్‌లోని ఓ కొండ‌పై ఉన్న క్యాసిల్ కూడా కుప్ప‌కూలింది. సుమారు 2200 ఏళ్ల క్రితం నాటి ఆ క‌ట్ట‌డం భూకంప తీవ్ర‌త‌కు శిథిల‌మైంది. ఖార‌మ‌న్‌మార‌స్‌లోని ప‌జారుక్ జిల్లా కేంద్రంగా భూకంపం సంభ‌వించింది.

అర్థరాత్రి గాఢనిద్రలో ఉండగా కంపించిన భూమి, పేకమేడల్లా కుప్పకూలిన బహుళంతస్థుల భవనాలు, ఇప్పటివరకు 500 మృతి చెందినట్లుగా వార్తలు

భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి మొత్తం 1700 బిల్డింగ్‌లకు పైగా ధ్వంసం అయిన‌ట్లు ట‌ర్కీ ఉపాధ్యక్షుడు తెలిపారు. కాగా, భూకంపం సమయంలో ఇళ్లు, బిల్డింగ్‌లు కూలిపోతున్న భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భూ ప్రకంపనల ధాటికి ఎత్తైన భవంతులు, ఇళ్లు క్షణాల్లో నేలమట్టమయ్యాయి.భారీ భూకంపం త‌ర్వాత కూడా బ‌ల‌మైన భూ ప్రకంప‌న‌లు న‌మోదు అయినట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే పేర్కొంది.

క‌నీసం 18 సార్లు భూమి రిక్టరు స్కేలుపై 4 కంటే ఎక్కువ తీవ్రత‌తో కంపించిన‌ట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 640 మందికి పైగా మృత్యువాత పడగా.. వేలల్లో ప్రజలు గాయపడ్డారు. ఈ భూకంపం వ‌ల్ల మ‌ర‌ణాల సంఖ్య దాదాపు ప‌ది వేల‌కు చేరే అవ‌కాశం ఉన్నట్లు అమెరికాకు చెందిన జియోలాజిక‌ల్ స‌ర్వే అంచ‌నా వేసింది.శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Here's ANI Tweet

Here's Videos

చారిత్రాత్మకంగా.. కేంద్రం చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపమని టర్కీ నేషనల్‌ భూకంప కేంద్రం చీఫ్‌ రాయిద్‌ అహ్మద్‌ రేడియో ద్వారా ప్రకటించారు.అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో.. చాలామంది శిథిలాల కిందే సమాధి అయినట్లు భావిస్తున్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

1999లో.. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం దాటికి 17వేల మంది దుర్మరణం పాలయ్యారు.ఇక 2020 జనవరిలో ఎలజిగ్‌లో 40 మందిని, అదే ఏడాది అయిజీన్‌ సీప్రాంతంలో 7 తీవ్రతతో సంభవించిన భూకంపం 114 మందిని పొట్టబెట్టుకున్నాయి. భద్రతా ప్రమాణాలను పాటించకుండా.. అడ్డగోలుగా భవనాలు నిర్మించడమే అందుకు కారణమని అక్కడి నిపుణులు చెప్తున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Peddapalli Shocker: పక్కింటి యువకుడితో 65 ఏళ్ల మహిళ సహజీవనం..తట్టుకోలేక వృద్ధ మహిళ మొదటి ప్రియుడు ఆమెను కర్రతో బాది స్మశానంలోకి లాక్కెళ్లి ఏం చేశాడంటే..?

‘Earthquake Incoming'? సముద్రం అడుగు నుంచి బయటకు వచ్చిన డూమ్స్‌డే ఫిష్, భూకంపం వస్తుందేమోననే భయంతో వణుకుతున్న మెక్సికన్లు, రాబోయే ఉపద్రవానికి సూచనగా ఒడ్డుకు వచ్చిన ఓర్ఫిష్ ..

Tesla Showrooms in India: భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టెస్లా, ఆ రెండు నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు, ఎక్కడెక్కడ తెరవబోతున్నారంటే?

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Share Now