Ebrahim Raisi Helicopter Accident: ఇరాన్ అధ్య‌క్షుడు ప్ర‌యాణిస్తున్న చాప‌ర్ మిస్సింగ్, ప్ర‌మాద స‌మ‌యంలో చాప‌ర్ లోనే ఇబ్ర‌హిం రైసీ స‌హా ప‌లువురు కీల‌క మంత్రులు

ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిసింది. ప్రతికూల వాతావరణమే ఈ ఘటనకు కారణమని తెలుస్తున్నది.

Ebrahim Raisi (Photo Credit- X/@clashreport)

Iran, May 19: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న ఛాపర్ (Chopper Crash) ఆదివారం ‘హార్డ్ ల్యాండింగ్’కు (Hard Landing) గురైంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిసింది. ప్రతికూల వాతావరణమే ఈ ఘటనకు కారణమని తెలుస్తున్నది. సంఘటన జరిగిన ప్రదేశాన్ని గుర్తించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్‌టీవీ పేర్కొంది. ఈ మేరకు వీడియోను రిలీజ్‌ చేసింది. ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో రైసీ ప్రయాణిస్తున్నారని.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో.. అజర్‌బైజాన్ దేశానికి సరిహద్దులో ఉన్న జోల్ఫా సమీపంలో ఈ సంఘటన జరిగిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థలు తెలిపాయి.

 

హెలికాప్టర్‌లో తూర్పు అజర్‌బైజాన్ గవర్నర్ అయతుల్లా అల్ హషీమ్, ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దొల్లాహియాన్ ఉన్నారని మీడియా తెలిసింది. రైసీ ప్రయాణిస్తున్న చాపర్‌ క్రాష్‌ అయ్యిందని పేర్కొంది. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ కాన్వాయ్‌లోని హెలికాప్టర్ ‘ప్రమాదం’ చిక్కుందని మీడియా పేర్కొంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసిందని సమాచారం. రైసీ ఆదివారం తెల్లవారు జామున అజర్‌బైజాన్‌లో అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి డ్యామ్‌ను ప్రారంభించారు. ఆరాస్ నదిపై రెండు దేశాలు కలిసి మూడు డ్యామ్‌లను నిర్మించాయి. రెండు దేశాల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నా.. రైసీ ఆ దేశంలో పర్యటించారు. ఇరాన్‌ దేశంలో అనేక హెలికాప్టర్‌ను ఎగుర వేస్తుంది. 2021 అధ్యక్ష ఎన్నికల్లో రైసీ గెలిచారు. అయితే, ఓటింగ్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో అతి తక్కువ ఓటింగ్ నమోదైంది.