US Shooting: అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం, 13 ఏళ్ల బాలిక స‌హా ఐదుగురు మృతి, త‌న‌ను తానే కాల్చుకొని నిందితుడి ఆత్మ‌హ‌త్య‌

లాస్ వెగాస్‌లోని రెండు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో ఓ వ్యక్తి కాల్పులు (Gunman Opens Fire) పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. వారిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు 47 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్‌గా పోలీసులు గుర్తించారు.

Representational image (Photo credits: ANI)

Las Vegas, June 26: అగ్రరాజ్యం అమెరికా (America) లో మళ్లీ కాల్పుల (shooting) కలకలం రేగింది. లాస్ వెగాస్‌లోని రెండు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో ఓ వ్యక్తి కాల్పులు (Gunman Opens Fire) పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. వారిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు 47 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఐదుగురిని కాల్చి చంపిన కొన్ని గంటల తర్వాత నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒకే కాంప్లెక్స్‌లోని రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్లలో అడమ్స్‌ కాల్పులు జరిపాడు.

కాల్పులకు గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. కాగా గత కొన్ని రోజులుగా అమెరికాలో వరుసగా చోటుచేసుకుంటున్న కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్లపై, కిరాణా దుకాణాలపై ఇలా ఎక్కడ పడితే అక్కడ దొంగలు, సైకోలు కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.