Representational Image of Shooting (Photo Credits: File Photo)

Vijayawada, Dec 21: ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో కాల్పులు కలకలం (Gun Fire) సృష్టించాయి. మండలంలోని మాధవరంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై నాటు తుపాకీలతో కాల్పులు జరిపారు. దీంతో హనుమంతు (50), రమణ (30) అనే ఇద్దరు వ్యక్తులు  తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని రాయచోటి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

నిందితుల కోసం గాలింపు

కాల్పుల్లో గాయాలపాలైన బాధితులిద్దరూ పాత సామానుల వ్యాపారం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాల్పుల ఘటనకు కారణంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం