Goldman Sachs Lay offs: కొనసాగుతున్న ఆర్ధికమాంద్యం, భారీగా ఉద్యోగులను తొలగించేందుకు బ్యాంకింగ్ దిగ్గజం నిర్ణయం, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాల్లో కోత

రిసిషన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే పలు కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటూ...నియమాకాలను నిలిపివేశాయి. అయితే టెక్ కంపెనీలతో పాటూ ఇతర సంస్థలు కూడా ఉద్యోగాల కోతవైపు మొగ్గు చూపుతున్నాయి.

Goldman Sachs (Photo Credit: Twitter)

New Delhi, May 31: ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ కొనసాగుతోంది. రిసిషన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే పలు కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటూ...నియమాకాలను నిలిపివేశాయి. అయితే టెక్ కంపెనీలతో పాటూ ఇతర సంస్థలు కూడా ఉద్యోగాల కోతవైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఉద్యోగాల్లో కోత పెట్టిన ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్ మాన్ సాచెస్‌ (Goldman Sachs) మరోసారి లే ఆఫ్స్ కు (Lay Offs) సిద్ధమైంది. రానున్న రోజుల్లో 250 మంది ఎంప్లాయిస్ ను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్వెస్టింగ్, బ్యాంకింగ్ రంగంలో ఇంతమంది ఉద్యోగుల తొలగింపు కలకలం సృష్టిస్తోంది. గోల్డ్ మాన్ సాచెస్ (Goldman Sachs) కంపెనీలో ప్రస్తుతం 45,400 మంది ఉద్యోగులు ఉన్నారు.

ఇప్పటికే తొలి త్రైమాసికంలో 3200 మంది ఉద్యోగులను తొలగించింది ఆ కంపెనీ. గతేడాది 500 మందిని ఉద్యోగం నుంచి తీసేసింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో పాటూ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వంటి ప్రతికూల అంశాలతో గోల్డ్ మాన్ సాచెస్ పై ప్రభావం పడుతోంది. వాటి నుంచి బయటపడేందుకు లే ఆఫ్స్ ప్రకటిస్తోంది. అంతేకాదు ఈ ఏడాది బడ్జెట్ ను కూడా తగ్గించిందని, ఖర్చులను అదుపులో పెట్టుకునేందుకు కావాల్సిన అన్ని మార్గాలను పరిశీలిస్తోంది కంపెనీ.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.