Israel–Hamas War: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ, ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరీ మృతి, యుద్ధం తీవ్రత మరింత పెరిగే అవకాశం

లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై నిన్న ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత, ఆ సంస్థ మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకడైన సలేహ్ అరౌరీ మృతి (Hamas deputy chief Saleh al-Aruri killed) చెందాడు.

Hamas deputy chief Saleh al-Aruri killed in Israeli strike on Lebanon (photo-X/Mohammad AmirHossain)

Lebanon, Jan 3: గత కొద్ది నెలల నుంచి ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై నిన్న ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత, ఆ సంస్థ మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకడైన సలేహ్ అరౌరీ మృతి (Hamas deputy chief Saleh al-Aruri killed) చెందాడు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు మృతి చెందగా వారిలో అరౌరీ (Hamas deputy chief Saleh al-Aruri) కూడా ఉన్నట్టు లెబనాన్ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన మిగతా ఐదుగురు అరౌరీ అంగరక్షకులుగా తెలుస్తోంది.

డ్రోన్‌ దాడితో చోటుచేసుకున్న పేలుడులో ఆరుగురు మృతి చెందినట్లు లెబనాన్‌ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. అందులో అరౌరీ ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్‌ నిరాకరించింది. హెజ్‌బొల్లాకు గట్టి పట్టున్న ప్రాంతమైన దక్షిణ బీరుట్‌ శివారులో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. కాగా ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు హెజ్‌బొల్లా మొదటి నుంచీ మద్దతుగా నిలుస్తోంది.

ఉక్రెయిన్ మీద 36 డ్రోన్లు, 122 మిస్సైళ్ల‌తో విరుచుకుపడిన రష్యా, ఒకేసారి అనేక లొకేష‌న్ల‌ను టార్గెట్ చేసిన పుతిన్ సేన 13 మంది మృతి

అరౌరీ హత్య నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై లెబనాన్‌ ఆపద్ధర్మ ప్రధాని నజీబ్‌ మికాతీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్‌ తమను యుద్ధంలోకి లాగాలని చూస్తోందని మండిపడ్డారు.

అరౌరీ మృతి చెందిన విషయాన్ని హమాస్ సంస్థ నిర్ధారించింది. గాజాలోని హమాస్ కమాండర్లను హతమార్చినట్టు గతంలో చెప్పిన ఇజ్రాయెల్.. హై ప్రొఫైల్ ఫిగర్‌ను చంపాల్సి ఉందని ప్రకటించింది. ఇప్పుడు లెబనాన్ రాజధానిపై దాడిచేసి ఆ పని కూడా పూర్తిచేసింది. అయితే, అరౌరీ మృతిపై ఇజ్రాయెల్ ఆర్మీ నేరుగా స్పందించలేదు.



సంబంధిత వార్తలు