ఉక్రెయిన్‌పై నేడు మళ్లీ ర‌ష్యా విరుచుకుప‌డింది. దేశంలోని ప‌లు ప్రాంతాల‌పై ర‌ష్యా అటాక్ చేసిన‌ట్లు ఉక్రెయిన్ వెల్ల‌డించింది. భీక‌రంగా జ‌రిగిన ఆ దాడుల్లో సుమారు 13 మంది మృతిచెందారు. డ‌జ‌న్ల సంఖ్య‌లో జ‌నం గాయ‌ప‌డ్డారు. దాదాపు 36 డ్రోన్లు, 122 మిస్సైళ్ల‌తో ర‌ష్యా దాడి చేసిన‌ట్లు ఉక్రెయిన్ మిలిట‌రీ తెలిపింది. ఒకేసారి అనేక లొకేష‌న్ల‌ను ర‌ష్యా టార్గెట్ చేసింద‌ని, ఇలాంటి ఘ‌ట‌న గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని ఉక్రెయిన్ చెప్పింది.

త‌మ వ‌ద్ద ఉన్న అని ర‌కాల ఆయుధాల‌ను ర‌ష్యా వాడిన‌ట్లు తెలుస్తోంది. ఇండ్లు, మెట‌ర్న‌టీ ఆస్ప‌త్రుల‌ను ర‌ష్యా టార్గెట్ చేసింద‌ని ఉక్రెయిన్ దేశాధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. కీవ్‌, లివివ్‌, ఒడిసా, జ‌పొరిజియా, దినిప్రో, ఖార్కివ్ ప‌ట్ట‌ణాల‌ను ల‌క్ష్యం చేస్తూ దాడులు జ‌రిగిన‌ట్లు ఉక్రెయిన్ వెల్ల‌డించింది. గ‌త వారం క్రిమియా పోర్టు ఫియోడోసియాలో ఉన్న ర‌ష్యా యుద్ధ నౌక‌ను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఆ ఘ‌ట‌న‌కు ప్ర‌తీక‌రంగా ర‌ష్యా ఇవాళ ప్ర‌తిదాడి చేసిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)