IPL Auction 2025 Live

IBM Layoffs: కొనసాగుతున్న ఐబీఎంలో భారీగా ఉద్యోగాల కోత, 3900 మందిని తొలగిస్తూ నిర్ణయం, ఐటీ కంపెనీలపై కొనసాగుతున్న ఆర్ధిక మాంధ్యం ఎఫెక్ట్‌

ప్రముఖ మల్టీనేషనల్‌ టెక్‌ కంపెనీలైన గూగుల్‌ (Google), అమెజాన్‌ (Amazon), మైక్రోసాఫ్ట్‌, మెటా (Meta) ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) కూడా చేరింది. కంపెనీలోని 3900 మంది ఉద్యోగులను తీసేస్తూ నిర్ణయం తీసుకున్నది.

IBM building in Bengaluru (Photo/wikipedia)

New York, JAN 26: సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్‌ టెక్‌ కంపెనీలైన గూగుల్‌ (Google), అమెజాన్‌ (Amazon), మైక్రోసాఫ్ట్‌, మెటా (Meta) ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) కూడా చేరింది. కంపెనీలోని 3900 మంది ఉద్యోగులను తీసేస్తూ నిర్ణయం తీసుకున్నది. వార్షిక నగదు లక్ష్యాలు తగ్గడంతోపాటు కొన్ని అసెట్‌ డివెస్ట్‌మెంట్ల కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 1.5 శాతం మాత్రమేనని తెలిపింది.

Washington Post Lays Off: మీడియాకు పాకిన లే ఆఫ్స్, 20 మంది జర్నలిస్టులకు ఉద్వాసన పలికిన వాషింగ్టన్ పోస్ట్, ఆన్‌లైన్ గేమింగ్ వర్టికల్ లాంచర్ మూసివేస్తున్నట్లు ప్రకటన 

అయితే క్లయింట్‌-ఫేసింగ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో నియామకాలు కొనసాగిస్తామని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్ జేమ్స్‌ కవనాగ్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాద్యం భయాల నేపథ్యంలో ఐటీ కంపెనీలు క్రమంగా ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. దీంతో అమెజాన్‌లో 18 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోగా, మెటా 11 వేలు, గూగుల్‌ 12 వేలు, మైక్రోసాఫ్ట్‌ 10 వేల మందిని తొలగించాయి.