ICJ On Gaza Attacks: గాజాలో నరమేధం ఆపేయండి.. ఇజ్రాయెల్ ను ఆదేశించిన అంతర్జాతీయ కోర్టు.. పట్టించుకోమన్న ఇజ్రాయెల్
గాజాలోని హమాస్ మిలిటెంట్లను అంతమొందించడమే లక్ష్యంగా బాంబు దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ కు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం (ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)) శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది.
Newdelhi, Jan 27: గాజా(Gaza)లోని హమాస్ మిలిటెంట్లను (Hamas) అంతమొందించడమే లక్ష్యంగా బాంబు దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ కు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) (ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)) శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది. గాజాలో మారణ హోమానికి దారి తీసేలా ఎటువంటి చర్యలు చేపట్టొద్దని ఇజ్రాయెల్ ను ఆదేశించింది. గాజాలో జరిగిన దాడుల్లో గాయపడ్డ పౌరులకు మానవతా సాయాన్ని కొనసాగించేలా చూడాలని కూడా కోర్టు సూచించింది. తమ ఆదేశాలకు అనుగుణంగా తీసుకొన్న చర్యలపై నివేదికను నెలలోగా సమర్పించాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించిన న్యాయస్థానం.. తమ పరిధి మేరకు మాత్రమే ఈ ఆదేశాలనిస్తున్నట్టు వెల్లడించింది. అయితే, కాల్పుల విరమణకు ఆదేశాలివ్వాలంటూ దక్షిణాఫ్రికా చేసిన విజ్ఞప్తిపై కోర్టు స్పందించలేదు.
మేం పట్టించుకోబోం
ఐసీజే ఇచ్చిన ఈ ఆదేశాలకు తాము కట్టుబడి ఉండబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్‌ను అంతమొందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.