UN Resolution: ఉక్రెయిన్ పై యుద్ధం ఆపండి! ఐక్యరాజ్యసమితి చారిత్రాక ఓటింగ్, రష్యాకు వ్యతిరేకంగా భారీగా ఓట్లు, ఓటింగ్ కు దూరంగా భారత్ సహా 35 దేశాలు

యుక్రెయిన్‌ (Ukraine), రష్యా (Russia)మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణ చర్యలను ప్రపంచ దేశాలు హెచ్చరించినప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌పై యుద్ధాన్ని(Russia war) మరింత తీవ్రతరం చేశాడు. యుక్రెయిన్‌పై రష్యా చర్యలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలోని సర్వసభ్య సమావేశంలో (UN General Assembly)ఓటింగ్ జరిగింది.

Russia-Ukraine Conflict (Representative image)

New Delhi, March 03: యుక్రెయిన్‌ (Ukraine), రష్యా (Russia)మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణ చర్యలను ప్రపంచ దేశాలు హెచ్చరించినప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌పై యుద్ధాన్ని(Russia war) మరింత తీవ్రతరం చేశాడు. యుక్రెయిన్‌పై రష్యా చర్యలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలోని సర్వసభ్య సమావేశంలో (UN General Assembly)ఓటింగ్ జరిగింది. యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని తక్షణమే ఆపివేయాలంటూ ఐక్యరాజ్యసమితి తీర్మానం (UN General Assembly resolution)చేసింది. యుక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సౌర్వభౌమధికారాన్ని సమర్థిస్తూ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UNGA) ఆమోదించింది. రష్యాకు వ్యతిరేకంగా, తీర్మానానికి అనుకూలంగా 141 సభ్య దేశాలు ఓటు వేశాయి. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, అప్ఘానిస్తాన్, ఐర్లాండ్‌ సహా 141 సభ్య దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటువేశాయి.

Russia-Ukraine War: భారత పౌరులంతా వెంటనే ఖార్కివ్‌ను విడిచి వెళ్లండి, ఖార్కివ్‌లోని భారతీయ పౌరులందరికీ అలర్ట్ మెసేజ్ జారీ చేసిన ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం

రష్యాకు అనుకూలంగా మరో ఐదు దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. యుక్రెయిన్ విషయంలో ఐరాసలో ఓటింగ్‌కు భారత్ సహా 35 దేశాలు దూరంగా ఉన్నాయి. మెజార్టీ దేశాలు యుక్రెయిన్‌కు అనుకూలంగా ఓటువేయడంతో తీర్మానం ఆమోదం పొందినట్లు ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రకటించింది. యుక్రెయిన్‌పై యుద్ధంలో అణ్వాయుధాలను సిద్ధం చేయడాన్ని తీవ్రంగా

తప్పుపట్టింది.

Russia-Ukraine War: భార‌తీయ విద్యార్థి మృతిపై రష్యా విచారణ‌, న‌వీన్ శేఖ‌ర‌ప్ప కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి చెబుతున్నానని వెల్లడి

యుద్ధాన్ని విరమించి ఇరుదేశాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చేయాలని సూచించింది. యుక్రెయిన్, రష్యా యుద్ధంపై భారత్‌ మొదటి నుంచే తటస్థంగా వ్యవహరిస్తోంది. ఇరుపక్షాలు శాంతియుత మార్గంలో చర్చల

ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తోంది. ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు దూరంగా ఉంది. ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలపై ఓటింగ్‌కు కూడా భారత్ గౌర్హాజరు అయింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Delhi Assembly Elections Notification: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. నేటి నుండి నామినేషన్ల స్వీకరణ, 17న నామినేషన్ల స్వీకరణకు చివరి తేది

Telangana Assembly Session 2024: తెలంగాణలో మన్మోహన్‌ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్

Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కేసీఆర్‌ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్.. సమావేశానికి రావాలని ఆహ్వానం

Share Now